Multani Mitti Vs Besan : ఎండాకాలంలో ఎండ వలన మన స్కిన్ బాగా ట్యాన్ అవడం, గ్లో తగ్గడం వంటివి జరుగుతుంది. దీనికి మనం మన స్కిన్ ని కాపాడుకోవడానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే వాటిలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతారు. వాటి వలన ఇంకా ఎన్నో రకాల సమస్యలు మన స్కిన్ కి రావచ్చు.
మన స్కిన్ కేర్ కోసం ముల్తానీ మట్టి లేదా శనగపిండి ని వాడవచ్చు. ఈ రెండింటిలో కెమికల్స్ అనేవి కలవవు. ముల్తానీ మట్టి ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని ఫుల్లర్స్ ఎర్త్ అని పిలుస్తారు. అయితే ఇది ఎక్కువగా మన స్కిన్ నుండి వచ్చే ఆయిల్ ను తగ్గిస్తుంది. మచ్చలు, మొటిమలు ఉన్నవారి ఇది వాడితే తొందరగా తగ్గుముఖం పడతాయి. మన స్కిన్ గ్లో గా మారడానికి మరియు ముఖం మృదువుగా మారడానికి ఉపయోగపడుతుంది.
శనగపిండిని వాడడం వలన అది మన చర్మం పైన ఉన్న మృతకణాలను తగ్గించి, చర్మం కాంతివంతంగా తయారుచేస్తుంది. నాలుగు స్పూన్ల శనగపిండి, ఒక స్పూన్ రోజ్ వాటర్, రెండు స్పూన్ల తేనె ను కలిపి ముఖానికి, మెడకు పట్టిస్తే మన చర్మం పైన ఉన్న జిడ్డు అనేది పోతుంది.
ముల్తానీ మట్టి, శనగపిండి అనేవి రెండు మన చర్మం కాంతివంతంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అయితే ఆయిల్ స్కిన్ ఉన్న వారు ముల్తానీ మట్టిని, డ్రై స్కిన్ ఉన్నవారు శనగపిండిని వాడితే మంచిది. ఈ విధంగా మనం మన స్కిన్ ని బట్టి ముల్తానీ మట్టి లేదా శనగపిండి అనేది వాడుకోవాలి.
Also Read : Vitamin E Capsules: విటమిన్ ఈ క్యాప్సిల్స్ తో మెరిసే చర్మం మీ సొంతం.. అందుకోసం ఏం చేయాలంటే!