ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇక ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటే చచ్చే వరకు పోదు అన్న విషయం తెలిసిందే. ఈ షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకునే ఫుడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. ఏది పడితే అది తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే డయాబెటిస్ పేషెంట్లను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక డ్రింక్ ఉదయాన్నే తాగితే షుగర్ పేషెంట్లకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున తాగితే ఎంతో మంచిదట. ఇది నిర్విషీకరణకు సహాయపడుతుందట. అలాగే మీ బరువును కూడా తగ్గిస్తుందని, ఇది మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. ఈ మసాలా దినుసు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అందుకు ప్రతి రోజూ ఉదయం పరిగడుపున దాల్చినచెక్కను టీని తాగాలని చెబుతున్నారు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందట.
చాలామంది షుగర్ పేషెంట్లు కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి అసలు ఇష్టపడరు. కానీ ఈ కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ కూరగాయలో ఇన్సులిన్ చర్యను అనుకరించే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఉదయాన్నే కాకరకాయ రసం తాగడం వల్ల రోజంతా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ వాటర్ ను పరిగడుపున తాగాట. ఇలా చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయట. కలబంద మన చర్మానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గాయాలను తొందరగా మాన్పుతుంది. కలబందలో హైపోగ్లైసీమిక్ ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖాళీ కడుపుతో కొద్దిమొత్తంలో కలబంద రసాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయట.