Site icon HashtagU Telugu

Juice: నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్ తాగాల్సిందే?

Mixcollage 07 Feb 2024 09 08 Pm 7707

Mixcollage 07 Feb 2024 09 08 Pm 7707

మునగాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునగాకును వేల సంవత్సరాల క్రితం నుంచి ఒక ఔషధముల ఉపయోగిస్తున్నారు. ఈ మునగాకును ఉపయోగించి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు కూడా తయారు చేస్తూ ఉంటారు. అందుకే డాక్టర్లు కూడా తరచుగా మునగ ఆకులు తినమని చెబుతూ ఉంటారు. మునగాకు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి సంబంధించిన విషయాలలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, కాలుష్యం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఎక్కువ శాతం కలిగి ఉంటుంది. మునగాకు రసం తాగడం మంచిది. ప్రతిరోజు మునగాకుల రసం తాగడం వలన పేగుల కదలికలు కలిగి సులువుగా మోషన్ జరుగుతుంది. మునగాకులో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ రసాన్ని తాగడం వలన నొప్పి వాపు కు ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు మునగాకు జ్యూస్ మూడుసార్లు మూడు నెలలు పాటు తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. షుగర్ లెవల్సింది అదుపులో ఉంచే మునగాకు రసాన్ని ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు. గుండె జబ్బులు చాతిలో నొప్పి శరీరంలో కొలెస్ట్రాల్ అని పిలిచే చెడు కొలెస్ట్రాల్ దీనికి పరిష్కారం గా మునగాకు రసాన్ని తాగడం శ్రేయస్కరం.ఈ రసాన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను మన శరీరం నుంచి తొలగించవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మునగాకు శరీరానికి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయం పడుతుంది. బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉండడంతో బాక్టీరియా పెరగకుండా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా నివారించే గుణం ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకు జ్యూస్ ప్రతిరోజు తాగడం వలన తాగడం వలన వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. సెల్ డామేజ్ కాకుండా చేసి చర్మం యొక్క స్థితిస్థాపకతను తగ్గిస్తుంది.ముడతలు రాకుండా చర్మం ప్రకాశవంతంగా మరియు యవ్వనంగా కనిపిస్తుంది. మొటిమల సమస్యలను తొలగిస్తుంది. మునగాకు రసాన్ని ప్రతిరోజు తాగడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే విటమిన్లు మినరల్స్ మెరుగవుతాయి. మునగాకు రసం శరీరంలోని కొలెస్ట్రాల స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా శరీర నిరోధకతను మెరుగుపరుస్తుంది. ఈ మునగాకు జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కొన్ని మునగాకులతో తీసుకొని వాటికి తగిన విధంగా నీటిని కలిపి రసం వచ్చేంతవరకు బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్ లో ఒక స్పూన్ తేనె లేదా నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రసాన్ని తాగడానికి ఇష్టపడని వారు టొమాటో, జిలకర ,మిరియాలు, పసుపు, కొత్తిమీర పొడి కొద్దిగా ఉప్పుతో మునగాకులను కలిపి తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే ఎన్నో వ్యాధులను దూరం చేయవచ్చు..