Seasonal Diseases: సీజ‌న్స్‌ను బ‌ట్టే కాదు.. నెల‌లను బ‌ట్టి కూడా వ్యాధులు..!

సీజ‌న్స్ బ‌ట్టి మ‌న‌కు కొన్ని వ్యాధులు వ‌స్తాయి. అయితే ఇక వ‌చ్చేది అక్టోబ‌ర్ నెల‌. అయితే అక్టోబ‌ర్ నెల‌లో కొన్ని ర‌కాల

  • Written By:
  • Updated On - September 30, 2022 / 07:13 PM IST

సీజ‌న్స్ బ‌ట్టి మ‌న‌కు కొన్ని వ్యాధులు వ‌స్తాయి. అయితే ఇక వ‌చ్చేది అక్టోబ‌ర్ నెల‌. అయితే అక్టోబ‌ర్ నెల‌లో కొన్ని ర‌కాల వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అక్టోబ‌ర్‌లో కొన్ని ర‌కాల వ్యాధులు ఎందుకొస్తాయంటే.. వ‌ర్షాలు తగ్గుముఖం పడతాయి. వ‌ర్షాల సమ‌యంలో కొన్ని వ్యాధులు ఎలా వస్తాయో.. వర్షాలు తగ్గే స‌మ‌యంలో కూడా అలాగే కొన్ని వ్యాధులు వస్తాయంటా. అవెంటో తెలుసుకొని ముందే జాగ్రత్తలు తీసుకుందాం. అవేంటో కూడా తెలుసుకుందాం.

డెంగ్యూ

అక్టోబర్‌లో డెంగ్యూ జ్వరం వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూతో బాధ‌ప‌డుతున్న వారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతాయి. డెంగ్యూ వ‌స్తే అధిక జ్వరం, కళ్లలో నొప్పి, మెడ, ఛాతిలో నొప్పి, వాంతులు వంటివి ఉంటాయి. డెంగ్యూ ఆడ ఏడిస్ దోమ కుట్టడం ద్వారా వ‌స్తుంది.

మలేరియా

అక్టోబర్ నెల ప్రారంభం కాగానే ప్రజల్లో మలేరియా వ్యాపిస్తుందనే భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితితో బాధపడుతున్న రోగులలో అధిక జ్వరంతో పాటు తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కాకుండా, రోగులకు కండరాల నొప్పి, అతిసారం కూడా ఉండవచ్చు.

చికున్‌గున్యా

చికున్‌గున్యా వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధి దోమలు కుట్టడం ద్వారా వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులకు జ్వరం వస్తుంది. జ్వరంతో పాటు జలుబు, తుమ్ములు వంటి ల‌క్షణాలు కనిపిస్తాయి.

వైరల్ జ్వరం

వైరల్ ఫీవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని లక్షణాలు దాదాపు డెంగ్యూ, చికున్‌గున్యా , మలేరియాకు వచ్చేవే ఉంటాయి. అందుకే చాలా మంది వైరల్ ఫీవర్‌లో తికమకపడుతుంటారు. మీకు వాంతులు, అధిక జ్వరం, గొంతు నొప్పి వంటివి అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్ర‌దించండి. సొంత వైద్యం చేసుకోకండి.