Monsoon and Diseases: వర్షాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు!

వర్షాలు మొదలయ్యాయి.. దీంతో ఎక్కడ చూసినా కూడా నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. మరి ముఖ్యంగా మన చుట్టూ ఉన్న

  • Written By:
  • Publish Date - September 7, 2022 / 07:15 AM IST

వర్షాలు మొదలయ్యాయి.. దీంతో ఎక్కడ చూసినా కూడా నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. మరి ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వాతావరణం లో చిన్న చిన్న ఇంకుడు గుంతలు, డ్రైనేజీ కాలువల లో ఎక్కువగా నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ వర్షాలు మొదలయ్యాయి అంటే చాలు మనుషులకు లేనిపోని రోగాలను తీసుకుని వస్తాయి. నీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి వర్షాలు పడే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నీటిని బిందెలలో, కుండలలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు. అలాగే ఎక్కువ రోజులు నిలువ చేసిన నీటిని తాగకూడదు. ఒకవేళ నిల్వ చేసిన నీరు ఉంటే దానిని ఇంటి శుభ్రం కోసం మాత్రమే వాడాలి. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా బయట దొరికే ఫుడ్ ని తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు ఇంట్లో వేడివేడిగా ఆహారాలు చేసుకుని తినాలి. అలాగే మాంసాహారానికి అంటే శాఖాహారానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. అలాగే కాల్ చిచల్లార్చిన నీటిని కానీ లేదంటే ఫిల్టర్ చేసిన నీటిని తాగడం మేలు. అలాగే మాంసాహారాన్ని తినాలి అనుకుంటే దానిని బాగా ఉడికించి లేదంటే ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని తినడం మేలు.

అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.. మీరు నిల్వ ఉండే అంటే పాత టైర్లు అలాగేకొబ్బరి చిప్పలు, చిన్న చిన్న పగిలిపోయిన మట్టి పాత్రలు లాంటివి ఉంటే వాటిని దూరంగా పడేయాలి. లేదంటే ఆ నీటి నుంచి భయంకరమైన దోమలు వచ్చి మనపై దాడి చేసి లేనిపోని అనారోగ్యాలకు కారణం అవుతాయి. అలాగే మన ఇంట్లో ఉండే చెత్తకుండీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే మల మూత్ర విసర్జనకు ముందు విసర్జన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అలాగే పల్లెటూర్లలో చాలామంది మట్టితో పాత్రలను శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. కేవలం సబ్బు, డిటర్జెంట్ లాంటివి మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొదటిగా చేయాల్సింది ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఆల్ అవుట్ లాంటివి దోమలు రాకుండా ఉపయోగించాలి.