Monkeypox : భారత్‌లో మంకీపాక్స్‌..రాష్ట్రాలకు కేంద్రం సూచనలు..!

Center Instructions to States: ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్‌ కేసు కూడా పాజిటివ్ గా నిర్ధరణ కాలేదు. కానీ, దీని విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ పలు సూచించలు జారీ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Monkeypox.. Third case registered in India

Monkeypox.. Third case registered in India

Center Instructions to States: దేశంలో తొలిసారి మంకీపాక్స్‌ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్‌ కేసు కూడా పాజిటివ్ గా నిర్ధరణ కాలేదు. కానీ, దీని విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ పలు సూచించలు జారీ చేసింది.

ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేందుకు కృషి..

ఇక, దేశంలో మంకీపాక్స్‌ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ పని చేస్తోందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎయిర్‌ పోర్టుఆల్లో మంకీపాక్స్‌ స్క్రీనింగ్‌ మరింత వేగవంతం చేసినట్లు చెప్పుకొచ్చింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్‌ ధీనంలోని పరిశోధనాశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు హెల్త్‌ మినిస్ట్రీ వెల్లడించింది. రాష్ట్రాలు చర్మ, ఎస్‌టీడీ లాంటి రోగాలకు చికిత్స చేసే క్లినిక్స్ పై దృష్టి పెట్టాలని తెలిపింది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అలర్ట్ గా ఉండాలి.. ఈ వ్యాధి, దాని వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ తన తెలిపింది.

మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు..

అలాగే, ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించిన.. మొదటిసారి 1970లో ఓ మనిషికి ఇది వ్యాప్తి చెందింది. ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి కనిపించేది. అయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేయడంతో.. 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలను స్టార్ట్ చేశాయి. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు.. ఒకటి క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌)గా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందడమే ఆందోళనకు గురి చేస్తుంది. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది అని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.

Read Also: Haryana Assembly Elections: పొత్తుల్లేవ్.. 20మందితో ఆప్ మొదటి జాబితా విడుదల

  Last Updated: 09 Sep 2024, 04:44 PM IST