Site icon HashtagU Telugu

Mpox Virus : ఫీవర్ హాస్పటల్ లో మంకీ పాక్స్ వార్డులు

Monkey Pox Wards In Fever H

Monkey Pox Wards In Fever H

మంకీ పాక్స్ (Mpox Virus)…ఇప్పుడు ప్రపంచ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా పీడ పోయిందని అంత భావిస్తుండగా..ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది. తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. అయితే మంకీపాక్స్ సోకిన రోగిని ఇప్పటి వరకు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. భారత్‌లో ఎంపాక్స్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయినప్పటికీ మంకీ పాక్స్ పట్ల ఆసుపత్రి వర్గాలను అలర్ట్ చేస్తున్నాయి పలు రాష్ట్రాలు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా హైదరాబాద్ ఫీవర్ హాస్పటల్ లో మంకీ పాక్స్ వార్డులను ఏర్పాటు చేసారు. కరోనా తరహాలోనే ప్రత్యేక వార్డులు సిద్ధం చేశారు. గతంలో కరోనా ట్రీట్‌మెంట్‌కు వినియోగించిన వార్డులను ఇప్పుడు మంకీ పాక్స్ వార్డులుగా మార్చారు. ఒక్కో వార్డులో 30 మంది పేషెంట్లకు చికిత్సను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి బెడ్‌కు వెంటిలేటర్లను అమర్చారు. దీంతో పాటు సాధారణ లక్షణాలు కలిగిన పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఐసోలేషన్ వార్డులను కూడా అందుబాటులో ఉంచారు. ఒక్కో వార్డులో యాభై మంది పేషెంట్లకు వైద్యం అందించవచ్చని డాక్టర్లు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలోనూ వార్డులు సిద్ధమవుతున్నాయని వైద్యాధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్‌తో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లకు కసరత్తు చేస్తుంది.

తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WHO హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా మంకీపాక్స్ వైరస్‌ వెలుగు చూసినప్పటికీ ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది . ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్‌లోనూ ఎంపాక్స్‌ కేసులు గుర్తించినట్లు WHO ప్రకటించడంతో టెన్షన్ మరింత ఎక్కువైంది.

Read Also : Bharat Bandh 2024: నేడు భార‌త్ బంద్‌.. వీటిపై ప్ర‌భావం ఉంటుందా..?