Moles Health Problems : పుట్టుమచ్చల్లాంటి మచ్చలొస్తున్నాయా ? ఈ రోగాలు రావొచ్చు..

మీ శరీరంపై పుట్టుమచ్చల రంగు, ఆకృతిలో ఉన్న మచ్చలు వస్తుంటే.. జాగ్రత్త వహించాల్సిందే. వాటి సైజు 6 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉండి.. రంగులో మార్పులుంటే ఇది ఆరోగ్యానికంత మంచిది కాదు.

  • Written By:
  • Publish Date - May 27, 2024 / 09:03 PM IST

Moles Health Problems : ఆడ, మగ.. ప్రతి ఒక్కరి శరీరంలోనూ పుట్టుమచ్చలుంటాయి. ఇవి కూడా శరీరంలో ఒక భాగమే. శరీరంలో ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుందో చెప్పేలా మనకు మచ్చ శాస్త్రం కూడా ఒకటుంటుంది. కానీ.. పుట్టుకతో వచ్చిన మచ్చలు కాకుండా మధ్యలో కొన్ని మచ్చలు వస్తుంటాయి. ఒక వ్యక్తికి జీవితకాలంలో 10-40 పుట్టుమచ్చలు వచ్చే అవకాశం ఉంది. అయితే పుట్టుకతోవచ్చిన మచ్చలు కాకుండా మధ్యలో వచ్చే మచ్చలు హార్మోన్ల మార్పుల వల్ల కూడా కావొచ్చు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

మీ శరీరంపై పుట్టుమచ్చల రంగు, ఆకృతిలో ఉన్న మచ్చలు వస్తుంటే.. జాగ్రత్త వహించాల్సిందే. వాటి సైజు 6 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉండి.. రంగులో మార్పులుంటే ఇది ఆరోగ్యానికంత మంచిది కాదు. అలాగే పుట్టుమచ్చ పెరగడం, విడిపోవడం కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ముఖ్యంగా స్త్రీలలో స్కిన్ క్యాన్సర్ వల్ల ఇలాంటి మచ్చలు రావొచ్చు. ఈ మార్పును ముందుగా గ్రహిస్తే.. వ్యాధిని నివారించవచ్చు. అలాగే చర్మంలో మార్పులు త్వరగా పోవాలంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంరక్షణ చాలా అవసరం. పుట్టుమచ్చలు ఎక్కువగా వస్తుంటే.. డాక్టర్ ను కలవండి. ఆరంభంలోనే చికిత్స చేయకపోతే స్కిన్ క్యాన్సర్ వంటి రోగాలబారిన పడే ప్రమాదం ఉంది.