Garlic: వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాగా ప్రతీ ఒక్కరి వంట గదిలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వెల్లుల్లి ఘాటైన వాసన, అద్భుతమైన రుచి వంటకాలకు ప్రాణం పోస్తాయి. అయితే వెల్లుల్లి కేవలం వంటల రుచికి మాత్రమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. వండిన వెల్లుల్లి కన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బను రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయట.
కేవలం 30 రోజుల్లోనే మీ శరీరంలో మీరు ఊహించని సానుకూల మార్పులను గమనించవచ్చని చెబుతున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక శక్తివంతమైన సల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. ఇదే వెల్లుల్లికి నేచురల్ యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. వెల్లుల్లి రెబ్బను నలిపినప్పుడు లేదా కోసినప్పుడు ఈ అల్లిసిన్ రిలీజ్ అవుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉండి, శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందట. వెల్లుల్లి నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందట. రోజూ ఒక రెబ్బ తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందట.
అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరం అని చెబుతున్నారు. ఇది రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుందట. రక్తాన్ని పలుచబరచి, గడ్డకట్టకుండా చూసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తి పెరిగి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందట. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. అలాగే ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయట. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారిస్తాయట.
దీని యాంటీ మైక్రోబియల్ గుణాలు మొటిమలను తగ్గించి, చర్మాన్ని స్పష్టంగా, కాంతివంతంగా మారుస్తాయట. వెల్లుల్లి రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుందట. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని దాన్ని కొద్దిగా నలిపి లేదా చిన్న ముక్కలుగా కోసి 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల అల్లిసిన్ పూర్తిగా రిలీజ్ అవుతుందట. ఆ తర్వాత ఆ ముక్కలను ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మింగాలట. దాని ఘాటును తట్టుకోలేని వారు, కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చని చెబుతున్నారు.
Garlic: రోజు పరగడుపున ఒక వెల్లుల్లి తింటే చాలు.. నెల రోజుల్లో కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు!

Garlic