Site icon HashtagU Telugu

Mint-Coriander: కొత్తిమీర,పుదీనా ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Mint Coriander

Mint Coriander

మన వంటింట్లో దొరికే ఆకుకూరల్లో పుదీనా కొత్తిమీర కూడా ఒక్కటి. వీటిని ఎన్నో రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా విడివిడిగా ప్రత్యేకించి కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవి రెండు అద్భుతమైన సువాసనను కలిగి ఉండడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. పుదీనాలో ఉండే కార్మినేటివ్ గుణాలు జీర్ణ సమస్యలను దూరం తగ్గిస్తాయి. మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడడే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంటు పుదీనాలో పుష్కలంగా ఉంటాయి.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్ ను పెంచడానికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. మెక్సికన్, ఇండియన్, మిడిల్ ఈస్టర్న్ తో సహా వివిధ రకాల వంటకాల్లో కొత్తిమీర ఆకులను సాధారణంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం అని చెప్పాలి. కొత్తిమీర కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుందట. కొత్తిమీర శరీరం నుంచి అదనపు సోడియాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

బీపీ, కొలెస్ట్రాల్ రిస్క్ లను నివారిస్తుందట. అలాగే వీటిని కంట్రోల్ చేస్తుందట. ఈ విధంగా కొత్తిమీర కూడా మన గుండెకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. కొత్తిమీరలో విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎతో పాటు ఈ రెండు పోషకాలు క్రమంగా మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర ఆకుల వాడకం మీరు తయారు చేసే వంటకంపై ఆధారపడి ఉంటుంది. పుదీనా శరీరం చల్లబరచడానికి, జీర్ణ సమస్యలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే కొత్తిమీర ఆకులు వంటకాలకు ప్రత్యేకమైన వాసనను ఇస్తాయి.

Exit mobile version