వేసవి (Summer ) కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం వేడెక్కి చెమటలు పట్టడం, నీరసంగా ఉండడం అనేవి సాధారణంగా ఎదురయ్యే సమస్యలు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటుతుండగా, వాతావరణ శాఖ గట్టి హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక, శరీరానికి శీతలతను అందించే పానీయాలు తాగడం అవసరం. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సహజంగా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Chubby Cheeks: బుగ్గలు మరీ లావుగా ఉన్నాయా.. ఈ విధంగా చూస్తే చాలు బుగ్గలు ఈజీగా కరిగిపోవాల్సిందే!
అటువంటి వాటిలో పుదీనా (Mint Coriander Juice) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పుదీనా చల్లదనం కలిగించే గుణానికి ప్రసిద్ధి చెందింది. దీనితో తయారు చేసే పుదీనా షర్బత్ వేసవిలో తాగడానికి ఉత్తమమైన పానీయం. ఈ షర్బత్ తయారికి పుదీనా ఆకులు, నిమ్మరసం, చక్కెర, జీలకర్ర పొడి, నల్లఉప్పు, చల్లటి నీళ్లు, ఐస్ క్యూబ్స్ అవసరమవుతాయి. ముందుగా పుదీనా ఆకులను నీటితో బ్లెండ్ చేసి పేస్ట్ తయారు చేసి, మెష్ జల్లెడతో వడకట్టి, మిగతా పదార్థాలతో కలిపి ఒక జగ్‌లో వేయాలి. చివరగా చల్లటి నీరు కలిపి బాగా కలిపి ఫ్రిజ్‌లో కొద్దిసేపు ఉంచాలి.
తయారైన పుదీనా షర్బత్‌ను ఐస్ క్యూబ్స్‌తో గ్లాసులో పోసి, పుదీనా కొమ్మలతో, నిమ్మకాయ ముక్కలతో అలంకరించి తాగితే వేసవిలో కలిగే నీరసం, తలనొప్పి, వడదెబ్బ లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కేవలం శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ వేసవిలో మీరు తప్పకుండా ఈ పుదీనా షర్బత్‌ను ఇంట్లో తయారుచేసుకొని తాగండి.