మాములుగా మైగ్రేన్ సమస్యతో చాలమంది బాధపడుతూ ఉంటారు. కాగా ఈ మైగ్రేన్ నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి అప్పటికప్పుడు ఉపశమనాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ యదా విధిగా తలనొప్పి మొదలవుతూ ఉంటుంది. కొంతమందిని ఈ నొప్పి తరచుగా వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారు టాబ్లెట్స్ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే అలాంటప్పుడు ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే మైగ్రేన్ సమస్య మరింత ఎక్కువ అవుతుందట. అందుకే శరీరంలో తగినంత నీరు ఉండటం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.అలాగే రోజుకు కనీసం ఎనిమిది నుండి 10 గ్లాసుల నీరు అయినా తాగాలట. ముఖ్యంగా వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం అని అలాగే కెఫిన్ తీసుకోవడం పూర్తిగా మానేయడం కూడా మైగ్రేన్ తలనొప్పిని పెంచుతుందని చెబుతున్నారు. తక్కువ నిద్ర వల్ల కూడా ఇలా తరచుగా మైగ్రేన్ నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రిళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్ర పోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
నిద్ర సరిపోకపోయినా మైగ్రేన్ నొప్పి వస్తుందట. మెడిటేషన్, యోగాసనాల ద్వారా చక్కటి నిద్ర వచ్చే విధంగా చేసి మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గించవచ్చని చెబుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు కూడా మైగ్రేన్‌కు కారణమవుతాయట. ప్రాసెస్ చేసిన ఆహారం, జున్ను, చాక్లెట్, కెఫిన్, ఆల్కహాల్ చాలా మందిలో మైగ్రేన్ సమస్యను పెంచుతాయని, కాబట్టి వీటిని అప్పుడప్పుడు మాత్రమే తినడం మంచిదని,ప్రతిరోజూ జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మానేయడం మంచిదని చెబుతున్నారు. కాగా ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మైగ్రేన్ నొప్పిను ప్రేరేపిస్తుందట. కాబట్టి వీలైనంత తక్కువ ఉప్పు తినడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. మెగ్నీషియం అధికంగా ఉండే ఆకుకూరలు, అరటిపండు, అవకాడో వంటివి తినడం మంచిదట. మైగ్రేన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే మంచు ముక్కలను ఒక గుడ్డలో చుట్టి తల, నుదురు, మెడ వెనుక భాగంలో 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలట. ఇది కూడా మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుందని చెబుతున్నారు. పైన చెప్పిన చిట్కాలను తరచూ ఫాలో అయితే ఈ మైగ్రేన్ నొప్పి అసలు ఉండదని చెబుతున్నారు.