Site icon HashtagU Telugu

Migraine : మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందండి ఇలా

Migrane

Migrane

కాఫీ, టీ… కెఫిన్‌ ఎక్కువగా ఉండే ఈ పదార్థాల కారణంగా మైగ్రేన్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాఫీ, టీ, చాక్లెట్‌ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మైగ్రేన్ మొదలైన కొంత సమయానికి తగ్గినట్లుగా అనిపించినా, మళ్లీ మొదలై తీవ్రంగా బాధిస్తుంటుంది. ఇటువంటి సమయంలో ఈ ఆహారాలు తీసుకోకుండా ఉంటే కాస్తంత ఉపశమనం పొందొచ్చు. అలాగే చక్కెరకు ప్రత్యామ్నాయాలతో తయారయ్యే స్వీట్లు తీసుకోవడం మైగ్రేన్ బాధితులకు అంత మంచిది కాదు. ఇవి నొప్పిని మరింత పెరిగేలా చేస్తాయట. వెన్న..పచ్చళ్లకు… నిర్ణీత సమయాన్ని దాటి నిల్వ ఉంచిన మాంసంతో తయారయ్యే ఆహారపదార్థాలు పార్శనొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. వీటిని నిల్వ ఉంచడానికి వినియోగించే నైట్రేట్లు, రంగుల నుంచి నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తంలోకి విడుదల అవుతుంది. ఇది ఈ నొప్పిని పెంచుతుంది. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వెన్నకు కూడా దూరంగా ఉండాలట. ఇందులోని రసాయనాల కారణంగా తలనొప్పి మరింత పెరుగుతుంది. అలాగే నిల్వ ఉంచిన పచ్చళ్లు, పులియబెట్టిన ఆహారపదార్థాలు, ఐస్‌క్రీం వంటి గడ్డకట్టిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉప్పు తక్కువగా వినియోగించడం అలవరుచుకోవాలి.

Exit mobile version