Site icon HashtagU Telugu

Micro Plastics : ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్‌.. ప్రజారోగ్యంతో ఆటలు

Micro Plastics In Sal And Sugar

Micro Plastics : ఉప్పు, చక్కెర.. మనం నిత్యం వినియోగిస్తుంటాం. వాటికి సంబంధించిన ఓ ఆందోళనకర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్రాండెడ్ ఉప్పు, చక్కెరలతో పాటు అన్ బ్రాండెడ్ వాటిలోనూ మైక్రో ప్లాస్టిక్‌లు(Micro Plastics) ఉన్నాయని తాజాగా గుర్తించారు. ‘టాక్సిక్స్‌ లింక్‌’ అనే పర్యావరణ పరిశోధనా సంస్థ  జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

ఈ అధ్యయనంలో భాగంగా 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరల శాంపిల్స్‌ను తీసుకుని రీసెర్చ్ చేశారు. ఇందుకోసం తీసుకున్న వాటిలో టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సముద్ర సాల్ట్, స్థానిక ముడి ఉప్పులు ఉన్నాయి. ఆ ఉప్పు, చక్కెరల శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా వాటిలో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయని తేలింది. అయితే అవి వివిధ రంగులలోని ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్‌ రూపంలో కనిపించాయని ‘టాక్సిక్స్‌ లింక్‌’ సంస్థ పేర్కొంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు సైజులో ఉన్నాయని వెల్లడించారు. ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయని రీసెర్చ్‌లో తేలింది.

Also Read :Neeraj Chopra: జ‌ర్మ‌నీకి వెళ్లిన నీర‌జ్ చోప్రా.. ఈ స‌మ‌స్యే కార‌ణ‌మా..?

అధ్యయనంలో వెల్లడైన కీలక అంశాలివీ.. 

ఇళ్లలో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్‌ ఉప్పులో అత్యధికంగా (89.15) మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు తేలింది. ఆర్గానిక్‌ రాక్‌ సాల్ట్‌లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయని గుర్తించారు. కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి.  మైక్రో ప్లాస్టిక్స్‌ మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. ఊపిరితిత్తులు, గుండె పనితీరును ఇవి నెగెటివ్‌గా ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకించి వీటివల్ల గర్భస్థ శిశువులకు పెనుముప్పు ఉంటుంది. కాగా, భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును, 10 చెంచాల చక్కెరను తీసుకుంటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. చక్కెరను అధికంగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పును ఎక్కువగా తింటే గుండె సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది.

Also Read :Telangana Employees : తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేసిన ఏపి సర్కార్‌