Obesity : ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఊబకాయులు ఉన్న దేశాల జాబితాలో అమెరికా మరియు చైనా అగ్రస్థానాల్లో ఉంటే, భారత్ మూడవ స్థానంలో నిలిచింది. పరిశీలనల ప్రకారం, దేశీయ జనాభాలో దాదాపు 20 శాతం మంది వ్యాధికరమైన స్థాయిలో బరువు పెరిగిన వారు. ఇది కేవలం ఎస్తీటిక్ సమస్య కాక, గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వైద్యులు చాలా సంవత్సరాలుగా ఈ సమస్యపై హెచ్చరించినప్పటికీ, ప్రజలు సున్నితంగా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
వెయిట్ లాస్ ఇంజెక్షన్ల వైపు దృష్టి
వీటికి ప్రత్యామ్నాయంగా, కొందరు ఆధునిక విధానాలను ఆశ్రయిస్తున్నారు. వీటిలో వెయిట్ లాస్ ఇంజెక్షన్లు పాపులర్ గా మారాయి. వీటికి శరీరంలో కొవ్వు తగ్గించే ప్రభావం ఉన్నప్పటికీ, వైద్యులు అవి కేవలం తాత్కాలిక పరిష్కారం అని హెచ్చరిస్తున్నారు. ఇంజెక్షన్లకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం, దీర్ఘకాలిక ఉపయోగానికి తగిన ఎఫెక్ట్ లేకపోవడం వంటి కారణాల వల్ల వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
జపాన్ పరిష్కారం: మెటాబో లా
ఇలాంటి సమస్యలను జపాన్ సృజనాత్మకంగా పరిష్కరించింది. అక్కడ మెటాబో లా 2008 లో ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ప్రకారం, 40–74 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు పొట్ట చుట్టూ కొలతలు వంటి ఆరోగ్య ప్రమాణాలను పరీక్షించుకోవాలి. (40 నుండి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులకు ఉద్యోగుల వార్షిక ఆరోగ్య తనిఖీలలో ప్రతి సంవత్సరం బరువు, వెయిట్ సూచిక (BMI), భాగంగా నడుము చుట్టుకొలతను కొలుస్తారు. పురుషులు 33.5 అంగుళాలు (85 సెం.మీ), మహిళలు 35.4 అంగుళాలు (90 సెం.మీ) దాటకూడదు. కొలతలు పరిమితి దాటితే, వ్యక్తికి ఆరోగ్య మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ తప్పనిసరి. లక్ష్యాలను అందుకోలేకపోతే సంస్థలకు జరిమానాలు విధించబడతాయి.
ఫలితంగా జపాన్ లో ఊబకాయం స్థాయిలు క్రమంగా తగ్గుతూ, ఆరోగ్య సంబంధిత వ్యాధులు కూడా నియంత్రణలోకి వచ్చాయి. భారతదేశంలో కూడా ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతుంది. మెటాబో లా వంటి క్రమపద్ధతిని, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే దీన్ని నిరోధించవచ్చు. వెయిట్ లాస్ ఇంజెక్షన్లను తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే భావించి, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. జపాన్ విధానం మన దేశంలోనూ పరిష్కార మార్గాలను చూపిస్తుంది. దీన్ని అనుసరించడం ద్వారా ఆరోగ్య సాంఘిక సమస్యలను తగ్గించవచ్చు.
ఇకపోతే..మన శరీరంలో 60% నీరు ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. త్వరగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కళ్ళు, చర్మం, జీర్ణశక్తిని బలోపేతం చేయడానికి మీరు రోజు ఒక గ్లాసు పండ్ల రసం తీసుకోవాలి. జ్యూస్‌లో ఉండే ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మీ అవయవాలను దృఢంగా చేస్తాయి. పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి.
గత కొన్ని సంవత్సరాలుగా పాల ఉత్పత్తులు మానవులకు అత్యంత ముఖ్యమైన ఆహారంగా చెప్పవచ్చు. ఉదాహరణకు- పాలు, పెరుగు, మజ్జిగ. వీటిని సమయానుకూలంగా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే క్యాల్షియం, ప్రొటీన్, పొటాషియం, ఫాస్పరస్ అనే మూలకాలు మిమ్మల్ని వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. భారతదేశంలో అనేక రకాల పప్పులు దొరుకుతాయి. మీరు మొలకెత్తిన పప్పులను తినవచ్చు. అలాగే ఉడికించిన తర్వాత కూడా తినవచ్చు. వీటివల్ల సులువుగా బరువు తగ్గవచ్చు.
