Site icon HashtagU Telugu

Mental Health : శారీరక ఆరోగ్యం ఉండాలంటే మానసిక ఆరోగ్యం ఎంత అవసరమో తెలుసా?

World Health Day 2024

Mental Health is More Important for Physical Health

మానసికంగా ఆరోగ్యంగా(Mental Health) ఉంటేనే మనం శారీరకంగా కూడా ఆరోగ్యంగా(Physical Health) ఉంటాము. మనం ఏదయినా పని వలన ఇబ్బంది పడినప్పుడు అదే పని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వలన మనకు మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వలన శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒక పనిని రోజూ ప్రశాంతత లేకుండా చేయడం వలన మన మెదడు ఒత్తిడికి గురవుతుంది. దాంతో మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఇంట్లో గొడవల వలన మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ రోజుల్లో ఎక్కువగా మొబైల్స్ కి అడిక్ట్ అవ్వడం వలన కూడా మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం ఎక్కువగా ఇతరులపై అసహనాన్ని చూపిస్తున్నా, ప్రతి చిన్న పనికి కోపం తెచ్చుకున్నా కూడా మనలో మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే.

మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటే మనుషులు ఎక్కువగా ఏ పని చేయకుండా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు మన మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. మానసిక ఆరోగ్యం కోసం రోజూ ధ్యానం చేయడం కోసం కొంత సమయం కేటాయించాలి. వ్యాయామం కూడా చేయాలి. పచ్చని చెట్లు, ప్రశాంతమైన ప్రదేశాల్లో సమయం గడపాలి. రోజు వారి మన పనులతో వచ్చే మానసిక ఒత్తిడిల నుంచి శారీరిక సమస్యలు కూడా వస్తాయి. అందుకే ముందు మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము.

 

Also Read : Hair Tips: కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే చాలు.. పలుచని జుట్టు ఒత్తుగా పెరగాల్సిందే?