Site icon HashtagU Telugu

Health Tips: పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే!

Health Tips

Health Tips

స్త్రీలకు ప్రతి నెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే ఈ సమయంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. చాలా మందిలో స్కిన్ కేర్ కి సంబందించిన సమస్యలు కూడా వస్తుంటాయి. మరి ముఖ్యంగా ఈ పీరియడ్స్ సమయంలో స్త్రీలు కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ నొప్పి వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అయితే నెలసరి వచ్చిన ప్రతిసారి రెండు మూడు రోజుల పాటు ఈ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. కొంతమంది మెడిసిన్స్ ని ఉపయోగించినప్పటికీ అవి తాత్కాలికంగానే పనిచేస్తూ ఉంటాయి. ఆ నొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉండి స్త్రీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

మరి ఆ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పీరియడ్స్ సమయంలో శరీరం డిహైడ్రేషన్ కి ఎక్కువగా గురవుతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో మంచినీరు తాగాలట. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా ఈ సమయంలో తినాలట. ఇది శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుందట. అలాగే పీరియడ్స్ రావడానికి ముందు నుంచి బెల్లం ముక్కని తినటం ప్రారంభించాలట. ఇలా చేయడం వల్ల శరీరం బలాన్ని సంతరించుకుంటుందట. పీరియడ్ సమయంలో రక్తస్రావం వల్ల శరీరం బలహీన పడుతుంది. బెల్లం తినడం వల్ల శరీరానికి కావాల్సిన సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి.

బెల్లంలో పొత్తు కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ సాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి పొత్తి కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి. అలాగే బొప్పాయి పండు తినటం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఈ పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సంకోచించి పొత్తి కడుపు కండరాలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో సహకరిస్తాయట. బొప్పాయిలో కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి తో పాటు ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి బొప్పాయి పండు తినటం వలన పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుందట.