Cancer Symptoms: పురుషులూ.. అవి క్యాన్సర్ సంకేతాలు తెలుసా..?

క్యాన్సర్ (Cancer)ఒక ప్రాణాంతక వ్యాధి.  దీని కారణంగా శరీరంలోని కణాలు నాశనం కావడం ప్రారంభిస్తాయి. క్రమంగా శరీర భాగాలు పనిచేయడం మానేస్తాయి. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే మరణానికి కూడా దారితీస్తుంది. శరీరంలోని కణాలు అసాధారణ స్థాయిలో వేగంగా పెరగడం వల్ల క్యాన్సర్ (Cancer) వస్తుంది.

  • Written By:
  • Publish Date - February 5, 2023 / 12:30 PM IST

క్యాన్సర్ (Cancer)ఒక ప్రాణాంతక వ్యాధి.  దీని కారణంగా శరీరంలోని కణాలు నాశనం కావడం ప్రారంభిస్తాయి. క్రమంగా శరీర భాగాలు పనిచేయడం మానేస్తాయి. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే మరణానికి కూడా దారితీస్తుంది. శరీరంలోని కణాలు అసాధారణ స్థాయిలో వేగంగా పెరగడం వల్ల క్యాన్సర్ (Cancer) వస్తుంది. ఈ అసాధారణ కణాలు శరీరంలోని సాధారణ కణజాలాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ అనేది మీ శరీరం అంతటా వ్యాపించగల ప్రమాదకరమైన వ్యాధి.  ఈ రోజు మనం పురుషులలో కనిపించే కొన్ని క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకుందాం..

◆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్

క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తే.. దాన్ని సులువుగా జయించవచ్చు.  కానీ దీని లక్షణాలను ప్రారంభంలో గుర్తించడం చాలా కష్టం. అనేక రకాల క్యాన్సర్లు ఉన్నప్పటికీ.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దిగువ పొట్ట (ప్యాంక్రియాస్) వెనుక భాగంలోని ఒక అవయవంలో సంభవిస్తుంది.

◆ అన్నం మింగడంలో ఇబ్బంది

క్యాన్సర్ కారణంగా కొంతమందికి అప్పుడప్పుడు అన్నం మింగడం కూడా కష్టంగా అనిపిస్తుంది. మీరు అకస్మాత్తుగా బరువు కోల్పోతుంటే.. ఫుడ్ మింగడంలో ఇబ్బంది ఉంటే.. వాంతులు అవుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి. అతను మీకు గొంతు లేదా కడుపు క్యాన్సర్ కోసం టెస్టింగ్స్, స్కానింగ్స్ చేయవచ్చు. మీ గొంతును పరిశీలించడానికి మీరు బేరియం ఎక్స్-రేని వైద్యుని సలహాతో చేసుకోవచ్చు.

◆ మూత్రవిసర్జనలో ఇబ్బంది

కొంతమంది పురుషులలో వయస్సుతో పాటు మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్య పెరుగుతుంది. కొంతమంది   రాత్రిపూట మళ్లీ మళ్లీ బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు మూత్ర నియంత్రణ సాధ్యం కాదు.  మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట కలుగుతుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా వస్తుంది. ప్రోస్టేట్ గ్రంధి యొక్క విస్తరణ కారణంగా ఈ లక్షణాలు అనుభూతి చెందుతాయి. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కావచ్చు. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వారు మీ రక్తాన్ని లేదా ప్రోస్టేట్‌ను తనిఖీ చేయవచ్చు.

◆ చర్మంలో మార్పు 

మీ చర్మంపై పుట్టు మచ్చలు లేదా మొటిమలు ఉంటే.. క్యాన్సర్ వచ్చినప్పుడు వాటి సైజు లేదా రంగు మారుతుంది.  కొన్ని మచ్చలు అకస్మాత్తుగా చర్మంపై కనిపిస్తాయి. మీకు ఇలాంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ఇది చర్మ క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. బయాప్సీ చేయమని డాక్టర్ మీకు సలహా ఇవ్వవచ్చు.

◆ వృషణాలలో మార్పులు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వృషణంలలో ఏదైనా మార్పు కనిపిస్తే ఆలస్యం చేయకూడదు. క్యాన్సర్ ను సరైన సమయంలో గుర్తించినట్లయితే చికిత్స కూడా చేయవచ్చు.  మీరు డాక్టర్ దగ్గరికి పోతే మీకు రక్త పరీక్ష , అల్ట్రాసౌండ్ స్కాన్ చేయవచ్చు.

◆ గుండెల్లో మంట

మీకు తరచుగా గుండెల్లో మంటగా అనిపిస్తే .. ఫుడ్స్ ను మార్చిన తర్వాత కూడా ఈ మంట తగ్గకపోతే దానిని తీవ్రంగా పరిగణించాలి. అధిక గుండెల్లో మంట అనేది కడుపు లేదా గొంతు క్యాన్సర్‌తో ముడిపడి ఉండవచ్చు. అందువల్ల, సమయాన్ని కోల్పోకుండా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

◆ నోటిలో మార్పులు

మీకు ధూమపానం లేదా పొగాకు అలవాటు ఉంటే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా మీ నోటిలో, పెదవులపై తెలుపు, ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. మీకు నోటిలో పుండులా కూడా అనిపించవచ్చు.  ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ మీకు కొన్ని పరీక్షలు , చికిత్సను సూచించవచ్చు.

◆ వేగంగా బరువు తగ్గడం

ఎటువంటి ప్రయత్నం లేకుండా  మీ బరువు వేగంగా తగ్గితే సందేహించాలి. ఒత్తిడి లేదా థైరాయిడ్ వల్ల అలా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సమస్యలు లేకపోయినా.. మీరు వేగంగా బరువు కోల్పోతుంటే అది ప్యాంక్రియాస్, పొట్ట లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. వైద్యుల సూచన మేరకు రక్తపరీక్ష ద్వారా సరైన సమాచారం తెలుసుకోవచ్చు.

◆ ఛాతీలో మార్పులు

ఛాతీలో ఏదైనా రకమైన గడ్డ ఉన్నట్లు అనిపించడం పురుషులలో రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణం. సాధారణంగా పురుషులు రొమ్ముకు సంబంధించిన ఈ లక్షణాలను విస్మరిస్తారు.దీని కారణంగా ఇది చాలా లేట్ దశలో బయటపడుతుంది.  పురుషులు గడ్డలకు సంబంధించిన ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.

◆ తీవ్ర అలసట

అనేక రకాల క్యాన్సర్లలో, చాలా అలసట అనుభూతి చెందుతుంది. పూర్తి విశ్రాంతి తీసుకున్నా ఈ అలసట తగ్గదు. ఈ అలసట చాలా పని తర్వాత వచ్చే అలసటకు భిన్నంగా ఉంటుంది. మీరు కూడా ఇలా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే..దీని కారణంగా మీ రోజువారీ పనిని చేయలేకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

◆ విపరీతమైన దగ్గు

విపరీతమైన దగ్గు సాధారణంగా క్యాన్సర్ లక్షణం కాదు. సాధారణంగా దగ్గు 3-4 వారాలలో దానంతట అదే నయమవుతుంది.  అయితే, మీ దగ్గు 4 వారాల తర్వాత కూడా కొనసాగితే.. దానితో పాటు మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణం కావచ్చు. దీని కోసం డాక్టర్ మీ ఎక్స్-రే చేయవచ్చు.