Epidural : డెలివరీ సమయంలో వెన్నుఎముకకు మత్తుమందు ఎందుకు ఇస్తారో తెలుసా…?

స్త్రీలకు ప్రసవం అంటే మరోజన్మలాంటిది. సంతోషం కంటే బాధనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి పరిస్థితులు వేరు. వైద్యరంగం అభివ్రద్ది చెందింది.

Published By: HashtagU Telugu Desk
Epidural Anesthesia Labor Imresizer

Epidural Anesthesia Labor Imresizer

స్త్రీలకు ప్రసవం అంటే మరోజన్మలాంటిది. సంతోషం కంటే బాధనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి పరిస్థితులు వేరు. వైద్యరంగం అభివ్రద్ది చెందింది. స్త్రీ పురిటి నొప్పులు పడాల్సిన అవసరం లేదు. ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడానికి ఎపిడ్యూరల్ మత్తుమందును వెన్నుఎముకలోకి ఇంజెక్ట్ చేస్తారు. ప్రసవ సమయంలో మహిళలు మరింత తేలికగా ఉండేందుకు ఈ మత్తుమందు సహాయపడుతుంది. గర్భిణి వెన్నుముకలోకి ఇంజెక్ట్ చేయగానే ఆ ప్రాంతం అంతా కూడా తిమ్మిరిగా మారుతుంది. ఇలా చేస్తే మహిళలు ప్రసవ వేదనను అనుభవించలేరు. కానీ ఈ డెలివరీ పద్దతికి అంగీకరించే ముందే కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

చాలామంది స్త్రీలు సురక్షితమైన..సుఖ ప్రసవాన్ని కోరకుంటారు. కానీ ప్రసవ వేదనను చాలామంది మహిళలు భరించలేరు. ప్రసవం ఎలా జరిగినా ఒకటే. గర్భాశయం సంకోచం, వ్యాకోచం చెందినప్పుడు నొప్పిని కలిగిస్తే మంచిది. ఇది బిడ్డ బయటకు వచ్చేందుకు సులభం అవుతుంది. కానీ చాలా మంది స్త్రీలకు ప్రసవం అంటే టాక్సోఫోబియా భయం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ప్రసవాన్ని ఎదుర్కొవడం మంచిది. మీకు కష్టమైన ప్రస్తవం ఉంటే మీరు ఎపిడ్యూరల్ మత్తుమందును ఎంచుకోవచ్చు.

ఎపిడ్యూరల్ గురించి….
ఈ పద్దతికి కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి. దీని గురించి వైద్యుడితో చర్చించి తెలుసుకోండి. ఈ ఎపిడ్యూరల్ అనేది డ్రగ్. మహిళల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది, వికారం, శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అదే సమయంలో దీని ప్రయోజనం కూడా ఏంటంటే ఇది మీ బిడ్డను ఏ విధంగానూ ప్రభావితం చేయదు. ప్రసవ నొప్పిని తగ్గించడంతోపాటు రిలాక్ట్స్ మూడును ఇస్తుంది. స్త్రీలకు ప్రసవాన్ని సులభం చేస్తుంది. శిశువును బహిష్కరించడంలో సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

ఆసుపత్రిని ఎంచుకోవడం
డెలివరీ సమయంలో సరైన ఆసుపత్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ పిల్లల శ్రేయస్సుకు సంబంధించింది. కాబట్టి మీ స్నేహితులతో సంప్రదించి మీకు నచ్చిన ఆసుపత్రిని ఎంచుకోండి. ఎపిడ్యూరల్ థెరపీ సమయంలో, మీ పిండం యొక్క హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఆసుపత్రి సిబ్బంది ప్రతి 5 నుండి 10 నిమిషాలకు ఈ పర్యవేక్షణ తప్పకుండా చేయాలి. కాబట్టి ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోని ఆసుపత్రిని ఎంచుకోండి.

ఎపిడ్యూరల్ అవసరమా?
ప్రసవానంతర మహిళలందరికీ ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది అవసరం లేదు. మీరు ప్రసవ నొప్పులను ఎదుర్కోగలిగితే దీనితో అవసరం ఉండదు. వెన్నునొప్పి మరియు తక్కువ రక్తపోటు ఉన్న మహిళలకు, ఎపిడ్యూరల్స్ జీవనాధారం అవుతుంది. కాబట్టి వారు దీనికి దూరంగా ఉండటం మంచిది. బ్లడ్ థిన్నర్స్ మరియు థిన్నర్స్ తీసుకునే మహిళలు ఎపిడ్యూరల్స్ ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఎందుకంటే ప్రసవ సమయంలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి రక్త సమస్యలున్న మహిళలు ఈ ఎపిడ్యూరల్ తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఎపిడ్యూరల్ ఎప్పుడు డెలివరీ చేయబడుతుంది?
దీన్ని ప్రసవ ప్రారంభంలో ఇవ్వరు. డెలివరీ ప్రారంభమైన తర్వాత ఇస్తారు. 4 లేదా5 సెంటీమీటర్ల వ్యవధిలో సాధారణ లేబర్ లక్షణాలు ఉంటే ఈ మందు ఇవ్వబడుతుంది. ఇంజెక్షన్ వాలుగా ఉన్న స్థితిలో లేదా కూర్చున్న స్థితిలో ఇవ్వబడుతుంది. మందు కాథెటర్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. అప్పటి వరకు కొద్దిగా నొప్పిని భరించవల్సి ఉంటుంది. బాధను భరించేందుకు మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.

  Last Updated: 29 Jan 2022, 10:01 AM IST