మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో జీవనశైలిలో మార్పులు వచ్చాయి. దీనివల్ల థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, ఒత్తిళ్లు, మానసిక కుంగుబాటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇటువంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు కూడా తప్పకుండా మెడిసిన్స్ తీసుకోవాల్సిందే. అయితే ఒకవేళ ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ తాగితే? అటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎటువంటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ సేవించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అలెర్జీ నివారణకు: బెనడ్రిల్ దగ్గు మందు గురించి తెలిసే ఉంటుంది. ఈ దగ్గుతో పాటు ఇతర అలెర్జీ, జలుబు నివారణకు ఇచ్చే యాంటీ హిస్టామిన్ ఔషధాలను ఆల్కహాల్ తో కలవకుండా చూసుకోవాలి. అలా కాకుండా కలిపి అటువంటివి తీసుకోవడం వల్ల తీవ్రమైన మగత ఆవహిస్తుంది. దీనివల్ల నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేకపోవడం, మోటారు వాహనాన్ని నడపలేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎపిలెప్సీ మందులు: మూర్ఛ నివారణకు వాడే టాబ్లెట్ లను ఆల్కహాల్ సమయంలో తీసుకోకూడదు. మూర్ఛ రాకుండా చూసుకోవడం ముఖ్యం కాబట్టి ఈ మందులకే ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే మూర్ఛలు మళ్లీ మళ్లీ రావచ్చు.
యాంటీ డిప్రెసెంట్స్: జ్ఞాపకశక్తి కోల్పోవడం, నాడీ మండల వ్యవస్థ బలహీన తీరు, శ్వాస నిదానంగా తీసుకోవడం అన్నవి యాంటీ డిప్రెసెంట్ ఔషధాలను, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల వచ్చే దుష్ఫలితాలు.