శరీరం సరైన పనితీరుకు నీరు చాలా ముఖ్యమైనది. చలికాలంలో (Winter) దాహం తక్కువగా ఉండటం వల్ల ప్రజలు తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల, మలబద్ధకం, తక్కువ రక్తపోటు, అలసట, తలనొప్పి, భయము, అధిక నిద్రపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ రాకూడదు అంటే.. చలికాలంలో (Winter) దాహం లేకున్నా రోజూ 8 గ్లాసుల నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కెఫిన్ కలిగిన పానీయాలు వద్దు:
కాఫీ, టీ, శీతల పానీయాలు , ఆల్కహాల్ వంటి కెఫిన్ ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. కాబట్టి వాటిని తగ్గించండి.
పండ్లు, కూరగాయలను తినండి:
నీటి కొరతను అధిగమించడానికి, ప్రతిరోజూ చాలా పండ్లు, కూరగాయలను తినండి. నీరు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలను డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. కూరగాయలతో చేసిన సూప్ ద్వారా బాడీ డీ హైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
లెమన్ జ్యూస్ (Leamon Juice):
మీ ఆహార ప్రణాళికలో నిమ్మకాయ రసాన్ని కూడా భాగం చేసుకోండి. దీనితో మీ శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
గ్రీన్ టీ (Green Tea):
హైడ్రేషన్ తో పాటు ఫ్రీ రాడికల్స్ ను దూరంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లని అందించే గ్రీన్ టీ తాగొచ్చు. సహజ నీటివనరులైన పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడతాయి.