Doctors Can Refuse Treatment : అవమానించేలా ప్రవర్తించే, వాగ్వాదానికి దిగే, దాడులకు దిగే రోగులకు చికిత్స చేయడానికి ఇకపై వైద్యులు నో చెప్పొచ్చు. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తాజాగా “రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ప్రొఫెషనల్ కండక్ట్) రెగ్యులేషన్స్ 2023” పేరిట విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో ఈవిషయాన్ని ప్రస్తావించింది. అయితే చికిత్సకు నిరాకరించే క్రమంలో.. ఎందుకు నిరాకరిస్తున్నారు ? అసలేం జరిగింది ? అనే వివరాలను పూర్తిగా నమోదు చేసి .. ఒక నివేదికను ప్రభుత్వ వైద్య, ఆరోగ్య విభాగాలకు పంపాలని డాక్టర్లకు సూచించింది. చికిత్సకు నిరాకరించే క్రమంలో.. ఆ రోగులను తదుపరి ట్రీట్మెంట్ కోసం ఇతర ఆసుపత్రులకు రికమెండ్ చేయాలని పేర్కొంది. “రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ప్రొఫెషనల్ కండక్ట్) రెగ్యులేషన్స్ 2023” గెజిట్ నోటిఫికేషన్ లోని కొత్త నిబంధనలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ -2002 స్థానంలో అమల్లోకి వస్తాయని నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది.
Also read : Flying Kiss : మొన్న రాహుల్..నిన్న కేటీఆర్..ఏంటి ఈ ఫ్లయింగ్ కిస్ లు..?
గెజిట్ నోటిఫికేషన్ లోని ముఖ్య అంశాలు ఇవీ..
- ఒక రోగికి ట్రీట్మెంట్ చేయడానికి అంగీకరించిన తర్వాత.. అతడిని డాక్టర్ నిర్లక్ష్యం చేయకూడదు.
- రోగికి ట్రీట్మెంట్ చేసే ముందే కన్సల్టేషన్ ఫీజు గురించి తెలియజేయాలి.
- ఆ రోగికి, అతని కుటుంబానికి ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. ఆ ట్రీట్మెంట్ నుంచి డాక్టర్ అకస్మాత్తుగా(Doctors Can Refuse Treatment) బయటికి రాకూడదు.
- రోగి లేదా అతడి సంరక్షకుడి నుంచి అంగీకారం లభిస్తేనే.. ఒక డాక్టర్ బదులు మరో డాక్టర్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
- మెడికల్ ప్రోడక్ట్స్, ఫార్మా కంపెనీల నుంచి వైద్యులు ఎటువంటి బహుమతులు, ప్రయాణ సౌకర్యాలను అందుకోకూడదని గెజిట్ నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
- ఔషధ కంపెనీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్పాన్సర్‌షిప్‌లను కలిగి ఉన్న CPD, సెమినార్, వర్క్‌షాప్, సింపోజియా, కాన్ఫరెన్స్ మొదలైన థర్డ్ పార్టీ విద్యా కార్యకలాపాలలోనూ డాక్టర్లు పాల్గొనరాదు.