Outbreak of Measles : వ్యాక్సిన్ తీసుకోని 40మిలియన్ల పిల్లలకు మీజిల్స్ ముప్పు…హెచ్చరించిన WHO..!!

  • Written By:
  • Updated On - November 24, 2022 / 01:03 PM IST

మీజిల్స్ వ్యాక్సిన్ పొందలేదని సుమారు 40మిలియన్ల మంది పిల్లలకు ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారిందని WHOహెచ్చరించింది. జూలైలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదించిన ప్రకారం… కోవిడ్ వ్యాప్తి కారణంగా 25 మిలియన్ల మంది చిన్నారులు డిప్తీరియాతోపాటు ఇతర వ్యాధులకు  సాధారణ టీకాలు వేయలేకపోయినట్లు తెలిపింది. ఎక్కువగా కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగినట్లు పేర్కొంది. తప్పుడు సమాచారం వల్లే ఇదంతా జరిగినట్లు వెల్లడించింది.

మీజిల్స్ అనేది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో ఒకటి. దీన్ని టీకా సాయంతో పూర్తిని నివారించవచ్చు. అయితే దీని వ్యాప్తిని నివారించడానికి 95శాతం మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. అధికారిక సమాచారం ప్రకారం…2021లో ప్రపంచవ్యాప్తంగా 9మిలియన్ల మీజిల్స్ ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యాయి. ఒక లక్షా 28వేల మంది మరణాలకు కారణమైంది. WHO, CDC “COVID-19 కారణంగా టీకాలు వేయడం, బలహీనమైన వ్యాధి నిఘా ప్రణాళికలలో ఆలసత్వం వల్ల 20 కంటే ఎక్కువ దేశాలలో మీజిల్స్ వ్యాప్తి కొనసాగుతోంది.

మీజిల్స్ వ్యాధికి గురయ్యే చిన్నారులు జ్వరం, దగ్గు, ముక్కు కారటం, కళ్లు ఎరుపుగా మారటం ప్రారంభం అవుతుంది. ఈ లక్షణాలు ప్రారంభమైన రెండు మూడు రోజుల్లో నోటి లోపల తెల్లటి మచ్చలు కనిపిస్తాయి.తర్వాత శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. మెడ, ఛాతీ, చేతులు, కాళ్లకు వ్యాప్తిస్తుంది. భారత్ లో వ్యాధి మహారాష్ట్ర, కేరళ, బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ ప్రాంతాల్లో 5ఏళ్లలోపు చిన్నారలుందరికీ మీజిల్స్, రుబెల్లా వ్యాక్సీన్ ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ముంబయి బీఎంసీ ఆసుపత్రిలో ఈ లక్షణాలతో చేరిన చిన్నారి కొన్ని గంటల్లోనే ప్రాణాలు వదిలాడు.