Foot Massage : పాదాలకు ఇలా మసాజ్ చేస్తే.. చాలా బెనిఫిట్స్

పాదాలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కీళ్లు, మృదు కణజాలాలను బలంగా చేస్తుంది. సరైన రక్తప్రసరణ ఉండటం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 10:21 PM IST

Ayurveda Foot Massage : టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషి ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. మన పూర్వీకుల కాలంలోనే చాలా ఆరోగ్యంగా ఉండేవారు. నేచురల్ గా వచ్చే గాలి, శారీరక కష్టం, అందుకు తగ్గట్టుగా ఆహారం, కంటినిండా నిద్ర, టెన్షన్ లేని జీవితం.. వారి ఆరోగ్య రహస్యాలు. ఇవన్నీ తెలిసినా.. మనం అలా ఉండటానికి ఎంతమాత్రం వీలుకానే కాదు. ఉండాలనుకున్నా.. మహా అయితే ఒకట్రెండు రోజులే. ఆ తర్వాత మళ్లీ మామూలే. పైగా అప్పట్లో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నేచురోపతి, ఆయుర్వేదాన్ని ఎక్కువగా వాడేవారు. కాలక్రమేణా అల్లోపతి వచ్చాక.. ఇన్ స్టంట్ గా రిలీఫ్ వస్తుందని వాటిని వాడటం మొదలుపెట్టాక.. సైడ్ ఎఫెక్ట్స్ పెరిగి మనిషి ఆరోగ్యం అంతకంతకూ పాడవుతుంది. ఇప్పుడు మళ్లీ అల్లోపతిని వీడి.. ఆయుర్వేదం, నేచురోపతి వైపు మొగ్గు చూపుతున్నారు. \

ముఖ సౌందర్యం, చర్మ సౌందర్యంపై ఉన్న శ్రద్ధ మన శరీరంలో భాగమైన పాదాలు, కాళ్ల రక్షణపై చాలా మందికి శ్రద్ధ ఉండదు. కానీ.. కాళ్లు, పాదాలను మసాజ్ చేయడంవల్ల శరీరానికి చాలా మంచిది. శరీరం రిలాక్స్డ్ గా ఉంటుంది. పాదాల నుంచి తల వరకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. వారానికి ఒక్కసారైనా.. పాదాలను మసాజ్ చేయడం వల్ల శక్తి, రక్తప్రసరణ పెరుగుతుంది.

రోజుకు ఒక్కసారైనా.. పాదాలకు మర్దనా చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..

పాదాలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కీళ్లు, మృదు కణజాలాలను బలంగా చేస్తుంది. సరైన రక్తప్రసరణ ఉండటం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. మసాజ్ వల్ల కాళ్లలో బెణుకులు, స్నాయువులు, కండరాలు, నరాలు నిరోధిస్తాయి. మొత్తం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

మసాజ్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. అంతర్గత ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. ఆందోళన, నిరాశ, అలసట, తిమ్మిరి నుంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే మసాజ్.. చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా చేస్తుంది. రక్తప్రసరణ ద్వారా కణజాలాలు ఎలాంటి అవరోధం లేకుండా మెరుగుపడతాయి.

గోరువెచ్చని నీటిలో రోజ్ మెరీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇతర ఆయుర్వేద పదార్థాలు, మూలికలను ఒక టబ్ లో వేసి.. పాదాలను నూనె, నీళ్ల మిశ్రమంలో కొద్దిసేపు నానబెట్టాలి.

ఇప్పుడు పాదాలు, కీళ్ల చుట్టూ వృత్తాకారంలో, కాళ్లపై నిలువుగా మసాజ్ చేయాలి. పాదాలను టబ్ లో నుంచి తీసి శుభ్రం చేయాలి. ఇది శరీరంపై మురికి లేకుండా చేస్తుంది. ఆందోళన తగ్గి, రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నా.. పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు కూడా.. పాదాలకు మసాజ్ చేయడం వల్ల తగ్గుతాయి.