బెల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అన్న విషయం మనందరికి తెలిసిందే. బెల్లం ని ఉపయోగించి ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. అలాగే కొన్ని రకాల కూరల్లో కూడా బెల్లం ని ఉపయోగిస్తుంటారు. బెల్లంలో అనేక రకాలైన పోషక విలువలు దాగి ఉన్నాయి. నిత్యం చిన్న ముక్క బెల్లం తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటివారు బెల్లం, పెరుగు కలుపుకొని రెండు పూటలా తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.. బెల్లం పెరుగు జలుబు సమస్యను కూడా తగ్గిస్తుంది.
అలాగే కీళ్ల నొప్పులు శరీరంలో ఏ భాగంలో అయినా నొప్పిగా అనిపించినప్పుడు నెయ్యితో బెల్లం వేడి చేసి శరీరంలో ఏ భాగంలో అయితే నొప్పిగా ఉంటుందో అక్కడ పెడితే నొప్పి తగ్గిపోతుందని చెబుతున్నారు. మై గ్రీన్ తలనొప్పితో బాధపడే వారికి బెల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే బెల్లం, నెయ్యి సమానంగా కలిపి తీసుకుంటే ఐదు నుండి ఆరు రోజుల్లో తలనొప్పి తగ్గుతుందని చెబుతున్నారు. బెల్లం ఎక్కువగా తినడం వల్ల అది ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుందట, అలాగే లంగ్స్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అంటున్నారు వైద్యులు. భోజనం చేసిన ప్రతిసారీ బెల్లాన్ని కాస్త తినడం వల్ల అది యాసిడిటీని తగ్గించి, జీర్ణ వ్యవస్థ పనితీరుకు ఉపయోగ పడుతుందట.
లివర్ ను శుభ్రపరచడానికి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుందట. బెల్లం తింటే లివర్ లో ఉండే హానికర పదార్థాలు, విషపదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయని అంటున్నారు నిపుణులు. తరచూ బెల్లం తినడం వల్ల ఆహార నాళాలు శుద్ధి పడి, రక్తం కూడా వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తాయట. ఒంట్లో అధికంగా ఉండే నీటిని బయటకు పంపడానికి, అధిక బరువును తగ్గించడానికి, గుండెజబ్బులు రాకుండా చూడడానికి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుందట. అదేవిధంగా నీళ్లలో బెల్లం వేసుకుని కలిపి తాగితే శరీరంలో ఉండే వేడి తగ్గుతుందని సూచిస్తున్నారు వైద్యులు.
Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి.