Site icon HashtagU Telugu

Summer Foods: వేసవిలో దొరికే ఈ ముఖ్యమైన పండ్లు రోజుకు రెండు తింటే చాలు.. సమస్యలన్నీ పరార్!

Summer Foods

Summer Foods

వేసవికాలం వచ్చింది అంటే చాలు మార్కెట్లో అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా రోడ్డు వైపున చిన్న చిన్న గంపల్లో తాటి ఆకుల్లో తాటి ముంజలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇవి చూడటానికి తెలుపు రంగులో ఉండడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. వేసవి తాపాన్ని తీర్చడంలో ఈ తాటి ముంజలు ముందు ఉంటాయి అని చెప్పాలి. వేసవి కాలంలో వేడి పెరిగే కొద్దీ ఆ ఉష్ణోగ్రతను శరీరం తట్టుకోలేదు. అలాంటి సమయంలో ఈ తాటి ముంజలు తీసుకుంటే కలిగే మార్పులు మీరే గమనించవచ్చును చెబుతున్నారు. మండే ఎండల్లో వీటిని పొట్ట నిండుగా తినేయాల్సిందే.

ఇవి తింటే క్యాలరీలు తక్కువగా, శక్తి ఎక్కువగా అందుతుందట వేడి వల్ల వచ్చే సమస్యలన్నీ తాటి ముంజలతో తీరిపోతాయని చెబుతున్నారు. ఎండవేడిమికి డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటారు. అలా డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలన్న, గురయ్యాక త్వరగా కోలుకోవాలన్న తాటిముంజలు తింటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. కాగా శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలు ఇందులో పుష్కలంగా ఉంటాయట. విటమిన్ బి, ఐరన్, కాల్షియం తాటి ముంజల్లో లభిస్తాయని చెబుతున్నారు.

అలాగే వీటి గుజ్జు రుచి లేత కొబ్బరిలా ఉంటుందట. కాగా వేసవిలో గర్భిణులు కచ్చితంగా వీటిని తినాలని చెబుతున్నారు. ఇవి జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేస్తుందట. దీనివల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా రావని చెబుతున్నారు. వీటిలో అధిక మొత్తంలో నీరే ఉంటుంది కనుక శరీర బరువును కూడా తగ్గిస్తాయట. అమ్మవారు వంటి వేసవి వ్యాధుల బారిన పడిన వారు కూడా వీటిని తింటే మంచిదని చెబుతున్నారు. ఎండను తట్టుకోలేక కొందరికి వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. అలాంటి వారికి ఒక్కరోజులో ఉపశమనం కావాలంటే తాటి ముంజలు ఓకే అరడజను వరకు లాగించేయాలట. వీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ కూడా తాగితే త్వరగా సమస్య నుంచి బయపపడతారట. ఎండలను విపరీతంగా ఉక్కపోత, చెమట పడుతుందట. శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి పోతుందట. అలాంటప్పుడు శరీరానికి చాలా అలసటగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఆ నీరసాన్ని, అలసటను వెంటనే దూరం చేస్తాయి తాటి ముంజలు.

Exit mobile version