Site icon HashtagU Telugu

Health: బీరకాయతో అనేక రోగాలకు చెక్

How to make Ridge Gourd Soup in Home

How to make Ridge Gourd Soup in Home

Health: బీరకాయను తరచుగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్రమం తప్పకుండా తింటే మతిమరుపు సమస్య తగ్గుముఖం పడుతుంది. రక్తహీనత తగ్గి, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు బీరకాయ తీసుకోవాలి. బీరకాయ తింటుంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి. బీరకాయ తినేవారిలో కంటిచూపు మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి బీరకాయ మేలు చేస్తుంది.

మలబద్ధకం నుండి బీరకాయ ఉపశమనం కలిగిస్తుంది. కాలేయ పనితీరును బీరకాయ రక్షిస్తుంది. బీరకాయ తింటుంటే డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. శరీర వేడిని తగ్గించి శరీరం కాంతివంతంగా వుండేదుకు సాయపడుతుంది. బీరకాయ లో ఉండే లక్షణాలు చక్కెర వ్యాధిని నివారించడంలో చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఇందులో ఉండే ఫ్లవనాయిడ్స్ యూరిన్ లోని షుగర్ లెవల్స్ తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. అలాగే రక్తంలో ఇన్సూలెన్స్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతాయి.

మొలల వ్యాధితో బాధ పడే వారికీ బీరకాయ చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు తమ డైట్ లో బీరకాయ తప్పనిసరిగా చేర్చుకోవాలి.ఇందులో ఉండే ఫ్యాట్ మరియు కోలేస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. బీరకాయ లో నీటి శాతం మరియు పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది.అందువల్ల త్వరగా ఆకలి వెయ్యదు. బీరకాయ ఎలాంటి అనారోగ్యాలకైన గురైనప్పుడు చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఇది జీవ క్రియలను చురుగ్గా పని చేసేలా చేసి త్వరగా శరీరం కోలుకునేలా చేస్తుంది.