Sesame Seeds: నువ్వుల వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నువ్వుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నువ్వులు రెండు

Published By: HashtagU Telugu Desk
Sesame Seeds

Sesame Seeds

నువ్వుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నువ్వులు రెండు రకాలు అందులో ఒకటి నల్ల నువ్వులు రెండు తెల్ల నువ్వుల. అయితే నేను చాలా వరకు వంటల్లో తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ స్వీట్ లలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నాగుల చవితి నెలలో నల్ల నువ్వులను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. శని దేవునికి కూడా ఈ నల్ల నువ్వులను ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. నువ్వులు ఏ కలర్ లో ఉన్నా కూడా వాటిలో ఉండే పోషకాలు సమానంగా ఉంటాయి. అయితే కేవలం నువ్వులు మాత్రమే కాకుండా నువ్వుల నూనె వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నూనెలోఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా సమృద్ధిగా ఉంటాయి. చాలామంది క్యాల్షియం సమస్యతో బాధపడుతూ దానిని అధిగమించడం కోసం టాబ్లెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటివారు నువ్వులను తినడం మంచిది. నువుల్లో 20 శాతం ప్రొటీన్ వుంటుంది. నువ్వుల్లో వుండే ఫైటో స్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వుల్లో ఫైటో స్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి.

నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల మహిళల్లో వచ్చే రొమ్ముక్యాన్సర్ ను నివారించవచ్చు. అలాగే క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారించవచ్చు. నువ్వులు తినటం వల్ల శరీరంలో పెరుకుపోయిన మలినాలను, అనవసరపు కొవ్వును కరిగించటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక శరీర నిగారింపుకు చక్కని ఔషధంగా కూడా పనిచేస్తుంది. చర్మ సంబంధిత రోగాలను నయం చేయటంలో ఎంతోబాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అటువంటివారు నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే మహిళల్లో రక్తహీనతను తగ్గించేందుకు నువ్వులు చక్కగా ఉపయోగపడతాయి. నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది.

  Last Updated: 05 Jan 2023, 06:35 PM IST