Chocolate Benefites: చాక్లెట్లు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

చాక్లెట్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ చాక్లెట్లను ఎక్కువగా తింటూ ఉంటా

  • Written By:
  • Publish Date - July 4, 2024 / 09:17 AM IST

చాక్లెట్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ చాక్లెట్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చాక్లెట్లు ఎక్కువగా తినకూడదని తింటే పళ్ళు పుచ్చిపోతాయని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. మరి చాక్లెట్లు తినడం మంచిదేనా? ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెలసరి సమయంలో స్త్రీలు ఐస్ క్రీమ్ చాక్లెట్ వంటివి తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

మరి ముఖ్యంగా చాక్లెట్ లో డార్క్ చాక్లెట్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ ని తింటే అది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందట. డార్క్ చాక్లెట్లను క్రమం తప్పకుండా తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల ఈజీగా బరువు తగ్గడంతో పాటు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందట. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందట. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ శరీరంలో ధమనులు, సిరల పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చాక్లెట్లు 70 శాతం కంటే ఎక్కువ పాలీఫెనాల్స్ ఉంటాయి.

ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. అలాగే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు వైద్యులు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందట. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే పిల్లలు డల్ గా, నీరసంగా ఉన్నప్పుడు ఈ డార్క్ చాక్లెట్లను కొద్ది మొత్తంలో తినిపించడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి యాక్టివ్ గా ఉంటారని చెబుతున్నారు. డార్క్ డెకరేట్లు మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు.

Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది.