Site icon HashtagU Telugu

Mango: మామిడి పండు తినడానికి ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?

Mango

Mango

త్వరలోనే మామిడి పండ్ల సీజన్ మొదలు కాబోతోంది. వేసవికాలం వచ్చింది అంటే చాలు మార్కెట్లో మనకు పెద్ద మొత్తంలో మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. రకరకాల మామిడి పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. అయితే మామిడి పండ్లు తినే ముందు తప్పకుండా వాటిని శుభ్రం చేసుకొని తినాలని చెబుతూ ఉంటారు. కొందరు వాటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టి తినాలని చెబుతూ ఉంటారు. అయితే నీటిలో నానబెట్టుకొని తినాలి అని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామిడిపండ్లను తినడానికి ముందు కనీసం 1 నుండి 2 గంటల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టాలట. కానీ సమయం తక్కువగా ఉంటే, కనీసం మీరు మామిడి పండ్లను 20 నుంచి 30 నిమిషాల పాటు అయిన నీటిలో ఉంచి ఆ తర్వాత తినాలని చెబుతున్నారు. మామిడి పండ్లును తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల దానిలో ఉన్న అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుందట. కాగా ఇది ఒక రకమైన యాంటీ న్యూట్రి యంట్, ఇది ఐరన్, క్యాల్షియం, జింక్,ఖనిజ లోపానికి దారితీసే ఇతర ఖనిజాల వంటి కొన్ని ఖనిజాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుందట. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

నానబెట్టిన మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు, తలనొప్పి, మలబద్ధకం ఇతర పేగు సమస్యలను కూడా నివారిస్తుందట. మామిడిపండ్లు అవొకాడో పండ్లు స్వీట్ గా పండినప్పుడు మాత్రమే పాలతో కలిపి తీసుకోవాలి. బాగా పండిన మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోవడం వల్ల వాత, పిత్తం తగ్గుతుందట. అయితే మామిడి పండ్లు మంచివే కదా అని సీజన్లో మాత్రమే లభిస్తాయి కదా అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.