Site icon HashtagU Telugu

Mango-Papaya: మామిడి, బొప్పాయి కలిపి తినవచ్చా.. వీటితో కండరాలు పెరుగుతాయా?

Mango Papaya

Mango Papaya

బొప్పాయి పండు అలాగే మామిడిపండు ఇవి రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయట. అయితే చాలా వరకు వీటిని విడివిడిగా తింటూ ఉంటారు. వేసవి కాలంలో మాత్రమే వీటిని కలిపి తింటూ ఉంటారు. మరి ఇవి రెండు కలిపి తినవచ్చా,అలా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ ను జీర్ణం చేయడానికి ఎంతో బాగా సహాయ పడుతుంది.

దీని ద్వారా మీరు తీసుకునే ప్రోటీన్ మీ శరీరంలో సమర్థవంతంగా పనిచేస్తుందట. బొప్పాయిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి వ్యాయామం వల్ల కలిగే కండరాల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మామిడి విషయానికి వస్తే.. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రోటీన్ కానప్పటికీ వ్యాయామాలకు అవసరమైన శక్తిని కూడా అందిస్తాయి. ఇది కారుకు నింపే ఇంధనం లాగా పని చేస్తుంది. మామిడిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని ఎంత మొత్తంలో తీసుకోవాలి అన్న విషయానికొస్తే..

వారంలో మూడు లేదా నాలుగు సార్లు 150 నుండి 160 గ్రాముల వరకు మామిడి పండు తినవచ్చు. అదేవిధంగా 140 నుండి 150 గ్రాముల వరకు బొప్పాయి పండ్లను తినవచ్చట. మామిడి, బొప్పాయి ఆరోగ్యానికి మంచివే కానీ, అవి ప్రోటీన్‌,కు ప్రత్యామ్నాయం కావు. సరైన ప్రోటీన్ కలిగిన ఆహారాలతో కలిపి వీటిని తీసుకోవాలి. ముఖ్యంగా వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుందట. కాబట్టి మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతున్నారు. అయితే ఇవి రెండు కలిపి తీసుకోవాలి అనుకున్న వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.