Protein Powder: ఇక మీ ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోండి.

మన శరీర బరువులో ప్రతి కిలో గ్రాముకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది.

మన శరీర బరువులో ప్రతి కిలో గ్రాముకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. మీ బాడీకి ఎంత ప్రోటీన్ (Protein) అవసరమో లెక్కించడానికి, మీ బరువును 0.8 తో గుణించండి. ఉదాహరణకు మీ బరువు 50 కిలోలు అయితే మీకు రోజూ 40 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది.

జిమ్ కు వెళ్లే యువత.. రెడీ మేడ్ ప్రోటీన్ పౌడర్స్ (Protein Powder)

గత కొన్నేళ్లుగా యువతలో ఫిట్‌నెస్ క్రేజ్ బాగా పెరిగింది. ఫిట్‌గా ఉండేందుకు యువత జిమ్‌కు వెళ్లిన వెంటనే ప్రొటీన్‌ పౌడర్‌ను తీసుకుంటారు. ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం శరీరాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. అయితే అవి ఖరీదైనవి. మార్కెట్లో లభించే రెడీ మేడ్ ప్రోటీన్ పౌడర్స్ తింటే లాంగ్ టర్మ్ లో ఆరోగ్యం పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని అంటారు.కాలేయం, మూత్రపిండాలను రెడీ మేడ్ ప్రోటీన్ పౌడర్స్ దెబ్బతీస్తాయనే ఒపీనియన్ కూడా ఉంది. ఆ భయంతో చాలామంది వాటిని కొనరు. ఇలా భయపడే కొద్ది మందిలో మీరు కూడా ఒకరైతే ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోండి.. దాని రిసిపి వివరాలు ఇవీ..

ప్రోటీన్ పౌడర్ (Protein Powder) తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. మఖానా (తామర గింజలు) – 10 నుంచి 15
  2. బాదం – 10 నుంచి 15
  3. వాల్ నట్స్ – 2 నుంచి 3
  4. ఫెన్నెల్ (సోంపు) – 1 tsp
  5. మిశ్రి (కడి చెక్కర) – 1 స్పూన్
  6. పచ్చి ఏలకులు – 2
  7. నల్ల మిరియాలు – చిటికెడు
  8. ఒక చెంచా మిశ్రమ గింజలు

ఇంట్లో ప్రోటీన్ పౌడర్ (Protein Powder) తయారీ ఇలా.. 

బాదం, మఖానాలను దోరగా వేయించి, వాటిని చల్లారనివాలి. వీటితో పాటు వాల్ నట్స్, సోంపు,మిశ్రిజ్ పచ్చి ఏలకులు, నల్ల మిరియాలు కలిపి బాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత పొడిని ఒక కంటైనర్‌లో ఉంచండి. పాలలో ఒక చిన్న చెంచా ప్రొటీన్ పౌడర్ మిక్స్ చేసి తాగితే మెల్లగా మీ కండరాలలో పెరుగుదల కనిపిస్తుంది. మీరు తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ కు మంచి రుచి కావాలంటే.. దానిలో కోకో పౌడర్‌ను కలపండి.

పోషక విలువలు:

ఈ హోమ్‌మేడ్ ప్రొటీన్ పౌడర్‌లో 275 కేలరీలు, 6 గ్రాముల చక్కెర, ఫైబర్ 9 గ్రాములు, ప్రోటీన్ 12 గ్రాములు, పిండి పదార్థాలు 22 గ్రాములు, కొవ్వు 16 గ్రాములు ఉంటాయి.

ఎలా నిల్వ చేయాలి?

  1. హోమ్‌మేడ్ ప్రొటీన్ పౌడర్‌ ను ఫ్రీజర్‌లో గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.
  2. మీరు ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్‌ను శీతలీకరించినట్లయితే, అది 6 నెలల వరకు ఉంటుంది.
  3. దీనిని గాలి చొరబడని డబ్బాల్లో లేదా గాజు పాత్రలలో నిల్వ చేయవచ్చు.

ఎలా ఉపయోగించుకోవచ్చు?

  1. ప్రోటీన్ బార్లను తయారు చేయండి.
  2. ఓట్‌మీల్‌లో కలపండి.
  3. స్మూతీస్‌కు జోడించండి.
  4. ప్రోటీన్ షేక్ చేయండి.
  5. ప్రోటీన్ పుడ్డింగ్ చేయండి.

Also Read:  Swiggy: స్విగ్గీ పార్శిల్‌లో నకిలీ రూ.2,000 నోట్లు చూసి షాక్ అయిన కస్టమర్లు