Site icon HashtagU Telugu

Raksha Bandhan Special: పంచదారతో కాకుండా బెల్లంతో ఈ స్వీట్స్ తయారు చేయండి..!!

Raksha Bhandhan Special

Raksha Bhandhan Special

రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల పండుగ. పండుగ సందర్భంగా రాఖీ కట్టడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. దీనికి తోడు స్వీట్లు ప్రముఖంగా ఉంటాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. స్వీట్లు ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అదనపు చక్కెర మీ శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. అయితే పంచదారకు బదులుగా బెల్లంతో చేసిన స్వీట్లు అయితే ఆరోగ్యానికి మంచిది.

పంచదారకు బదులు బెల్లం వాడండి:
ఇంట్లో, ఏదైనా పండగ సీజన్‌లో స్వీట్‌లు సిద్ధం చేసుకున్నప్పుడు, ముందుగా చేరేది పంచదార డబ్బే! పంచదారకు బదులు బెల్లం వాడటం అలవాటు చేసుకోండి. ఇది మీరు తయారుచేసే మిఠాయి లేదా ఇతర తీపి వస్తువులను రుచిగా, ఆరోగ్యకరంగా కూడా ఉంచుతుంది.

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. మీ శరీరంలో ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్ వాటి ప్రభావాలను తగ్గించండంతోపాటు మీ కణాలకు నష్టం జరగకుండా చేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను కూడా దూరం చేయడంతోపాటుగా కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

జిలేబీ కంటే చిక్కీ మేలు:
పండగకి జిలేబీ చేయాలనుకుంటున్నారా. అయితే దానికి ఇప్పుడే గుడ్ బై చెప్పండి. బెల్లంతో చక్కగా చిక్కీని తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా వేరుశనగ, నువ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, మెగ్నీషియం, విటమిన్, మినరల్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అన్నీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి.

ప్రధానంగా మధుమేహం, కీళ్లనొప్పులు, గుండె సమస్యలు, థైరాయిడ్ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు సహాయపడతాయి. ముఖ్యంగా నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీర బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. ఒకసారి ఈ రక్షా బంధన్ కు చిక్కీ ప్రయత్నించండి.

గులాబ్ జామూన్ కు బదులు బెల్లం రసగుల్లా!
గులాబ్ జామూన్ చేయడానికి వంట నూనె అవసరం. అలాగే, ఇది వివిధ చక్కెర కంటెంట్ కలిగి ఉంటుంది. కానీ రసగుల్లా సిద్ధం చేయడానికి బెల్లం పేస్ట్ ఉపయోగించవచ్చు. అలాగే నూనెలో వేయించాల్సిన పనిలేదు. కాబట్టి ఈ రక్షాబంధన్‌లో మీరు జామూన్‌కు బదులుగా రసగుల్లా తినవచ్చు.

డార్క్ చాక్లెట్ తినండి:
చాక్లెట్‌ను ఇటీవల చాలా సందర్భాలలో అంటే ఇంట్లో ప్రత్యేక సందర్భాలలో ఉపయోగించడం కనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరం కూడా. మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వడం కూడా సౌకర్యంగా ఉంటుంది.

ఇందులో కోకో అధిక మొత్తంలో ఉంటుంది. చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా రక్షాబంధన్ సమయంలో ఒకసారి డార్క్ చాక్లెట్‌ని ప్రయత్నించవచ్చు.