Site icon HashtagU Telugu

Ragi Roti: వామ్మో.. రాగి రోటీ వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా!

Ragi Roti

Ragi Roti

రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రాగుల నుంచి వచ్చే రాగి పిండితో రకరకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు. రాగి బిస్కెట్స్ రాగి జావా, రాగి రోటి, రాగి సంగటి అంటూ రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. రాగి పిండితో చేసే ప్రతి ఒక వంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో రాగి రోటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రాగుల రోటీలో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

రాగి రోటీ మనల్ని శక్తివంతంగా ఉంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాగులలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు కంట్రోల్ చేయడానికి, తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే మొత్తం కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే సంతృప్తి భావనను కూడా పెంచుతుందని చెబుతున్నారు. రాగులు కాల్షియానికి అద్భుతమైన మూలం అని చెప్పాలి. ఇది ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం.

రాగి రోటీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. అదేవిధంగా రాగుల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నిరంతరం శక్తిని అందిస్తాయి. ఇది రోజంతా మీ శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. అథ్లెట్లు, చురుకైన వ్యక్తులు లేదా శక్తి బూస్ట్ అవసరమైనవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి తరచుగా రాగి రోటిలను తినడం అలవాటు చేసుకోమని వైద్యులు సైతం సూచిస్తున్నారు. రాగుల్లో కరగని ఫైబర్, పాలీఫెనాల్స్ వంటి డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. రాగుల రోటీని సమతులాహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. రాగులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్దకాన్ని నివారించడానికి, ప్రేగు కదలికలను నియంత్రించడానికి, జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా సహాయపడుతుందని చెబుతున్నారు.