Site icon HashtagU Telugu

Turmeric Water Benefits: పసుపు నీరు తాగ‌డం వ‌ల‌న కలిగే ప్రయోజనాలివే..!

Turmeric Water Benefits

Turmeric Water Benefits

Turmeric Water Benefits: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే (Turmeric Water Benefits) ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పసుపు మ‌న‌ శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పసుపు అనేది ప్రతి ఒక్కరి వంటగదిలో సులభంగా దొరుకుతుంది. పసుపు.. ఆహారం రంగు, రుచిని పెంచడమే కాకుండా పసుపు నీరు తాగ‌డం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయ‌ని నిపుణులు అంటున్నారు.

పసుపు నోటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పసుపును ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కాకుండా పసుపు అనేక కడుపు సంబంధిత వ్యాధులలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక విధంగా మసాలా దినుసులలో పసుపు ఆరోగ్యానికి మంచిద‌ని చెప్పవచ్చు. పసుపు నీరు తాగ‌డం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: July Rainfall : జులై‌లో తెలంగాణకు వర్షపాత సూచన.. ఐఎండీ అంచనాలివీ

ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగ‌డం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో 1 గ్లాసు ప‌సుపు నీరు త్రాగడం ఉత్తమ మార్గమ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి నీళ్లలో చిటికెడు పసుపు వేసి ఉదయాన్నే వేడి చేసి తాగితే ఇంకా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ట‌. ఈ నీళ్లు తాగేటప్పుడు మలసానా భంగిమలో కూర్చుంటే ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు. ప‌సుపు నీరు తాగిన కొంత సమయం వరకు ఏమీ తినకూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని  ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.