Aphrodisiac: ఈ తేనేతో అలాంటి సమస్యలకు చెక్.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా!

తేనె.. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే ద్రవపదార్థం. ఈ తేనే తీయగా నోట్లో పెట్టుకో

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 09:30 AM IST

తేనె.. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే ద్రవపదార్థం. ఈ తేనే తీయగా నోట్లో పెట్టుకో గాని ఇట్టే కరిగిపోతూ ఉంటుంది. అయితే తేనెటీగలు ఎంతో కష్టపడి పోగు చేసుకున్న దీనిని మనం తాగేస్తూ ఉన్నాం. అయితే ఇది ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయితే స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పిచ్చి తేనే లేదా హిమాలయన్ తేనె మాత్రం అందుకు పూర్తి భిన్నం అని చెప్పవచ్చు. ఈ పిచ్చి తేనెను రెండు చెంచాలు తాగాము అంటే చాలు.. వెంటనే కళ్ళు తిరుగుతాయి. మత్తు వచ్చి తన తిరుగుతుంది.

కానీ ఈ తేనే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్వర్గంలో ఉన్న ఫీలింగ్ ని కలిగిస్తుంది. అయితే బాగుంది కదా అని మరింత తాగితే వెంటనే దాని ప్రభావం చూపిస్తుంది. వాంతులవ్వడం మూర్ఛ రావడం అరుదైన సందర్భంగా మరణం కూడా వస్తుంది. ఇది ఇదేనే మామూలు తేనెల మాదిరి కాకుండా కాస్త ధర ఎక్కువే అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ తేనె నేపాల్ లో ఎక్కువగా లభిస్తుంది. అక్కడి ప్రజలు ఈ తేనెను ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే ఈ తేనె రుచి చేదుగా ఉంటుంది. అంతేకాకుండా మొదటిసారి తాగే వారికి గొంతులో ఇరిటేషన్ ఉంటుంది. అయితే 2018లో జరిపిన అధ్యయనం ప్రకారం ఈ తేనెను క్రీస్తుపూర్వం 2,100 సంవత్సరాల నుంచి వాడుతున్నారట.

సాధారణ తేనెలో లేని గ్రాయానోటాక్సిన్స్ అనేది ఈ తేనెలో ఉంది. అదే మత్తు లేదా విషంలా మనపై పనిచేస్తుంది అని అధ్యయనం చేసిన వాళ్లు చెప్పారు. నేపాల్ లో తేనెటీగలు జస్ట్ తేనె మాత్రమే కాకుండా పువ్వుల పుప్పొడి నుంచి గ్రాయానోటాక్సిన్స్‌ ని కూడా తేనెటీగలు సేకరిస్తున్నాయి. వాటికి తెలియకుండానే దీన్ని సేకరిస్తున్నాయి. అయితే అవి తేనె పోగేస్తున్నామని అనుకుంటూ వాటికి తెలియకుండానే విషాన్ని కూడా అందులో చేర్చుతున్నాయన్నమాట.