Lychee Juice Benefits: లిచీ పండ్ల జ్యూస్ తో బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు!

లిచీ పండ్లు.. చాలా తక్కువ మంది మాత్రమే వీటిని తింటూ ఉంటారు. మార్కెట్లో కూడా ఇవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేవలం ఎండాకాలంలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో అధిక శాతం నీరు

  • Written By:
  • Publish Date - July 4, 2024 / 08:58 PM IST

లిచీ పండ్లు.. చాలా తక్కువ మంది మాత్రమే వీటిని తింటూ ఉంటారు. మార్కెట్లో కూడా ఇవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేవలం ఎండాకాలంలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో అధిక శాతం నీరు ఉంటుంది. సోడియం, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతే తిరిగి శరీరానికి అందిస్తుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే కూడా ఎండకాలం హీట్‌ స్ట్రోక్‌ కు గురవుతారు. వేసవి కాలంలో ఈ పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.

ఇందులో ఎలక్ట్రోలైట్ పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో నీటి శాతం నిర్వహిస్తుంది. అలాగే కండరాల పనితీరుకు కూడా సహకరిస్తుంది. ఈ లిచీ పండు డిహైడ్రేషన్కు గురి కాకుండా కాపాడుతుంది. లీచి పండులో విటమిన్ సి తో పాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిస్తాయట. అలాగే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుందట. ఇది ప్రి రాడికల్స్ సమస్య రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు వైద్యులు.

లీచి పండ్లు తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి ప్రేరేపించి యాంటీ బాడీస్‌లా ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అదేవిదంగా సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. లిచిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తుంది. ఇందులో పాలీఫెనల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ని సమతుల్యం చేస్తాయి. జబ్బులు రాకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నివారిస్తాయి. లీచిపండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎండకాలం మన శరీరాన్ని కాపాడుతాయి.