Site icon HashtagU Telugu

Lychee Fruit: లిచీ పండు వల్ల మాత్రమే కాదండోయ్..గింజల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు?

Mixcollage 13 Jun 2024 04 35 Pm 6518

Mixcollage 13 Jun 2024 04 35 Pm 6518

లిచీ పండ్లు.. వీటిని మనలో చాలా తక్కువ మంది మాత్రమే తిని ఉంటారు. మార్కెట్లో కూడా చాలా తక్కువగా ఇవి లభిస్తూ ఉంటాయి. ఈ పండ్లు పైన పొట్టు ఎర్రగా లోపల కండ తెల్లగా కాస్త తినడానికి తియ్యగా ఉంటుంది. చాలామందికి ఈ లిచీ పండ్ల వల్ల కలిగే లాభాల గురించి తెలియక వాటిని తినరు. కానీ వీటి వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. అయితే చాలామంది చేసే పని ఏమిటంటే లిచీ పండ్లు తిన్న తర్వాత వాటి గింజలను పారిస్తూ ఉంటారు. కానీ ఇక మీదట అలా అస్సలు చేయకండి.

ఎందుకంటే లిచీ పండ్ల వల్ల, వాటి గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. లిచీ గింజలు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా చెప్పవచ్చు. మరి వీటి వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. లిచీ పండు విత్తనాల్లోని గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే వీటికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం ఉంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడమే కాకుండా మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలను కూడా తగ్గిస్తుంది. అదేవిదంగా శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో ఈ లిచి గింజలు సహాయపడతాయి.

లిచీ విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. లిచీ విత్తనాలు కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. అయితే లిచీ విత్తనాలను నేరుగా తినకూడదు. అలాగే ఈ విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పదార్ధాలలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ప్రోయాంతోసైనిడిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లిచీ ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. చర్మానికి మరింత మేలు చేస్తుంది. లిచీ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్‌లో సమృద్ధిగా ఉండే పాలీఫెనాల్స్ చర్మ స్థితిస్థాపకత, ఆర్ద్రీకరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.