Site icon HashtagU Telugu

Warm Water: గోరువెచ్చని నీటితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు!

Warm Water

Warm Water

మామూలుగా చలికాలంలో అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఒక్క చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఇతర సీజన్లలో కూడా గోరువెచ్చని నీరు తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోరువెచ్చని నీరు ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయట. ఉదయాన్నే లేచి పరిగడుపున గోరువెచ్చని నీటిని తాగితే శరీరంలోని విష పదార్థాలు అన్ని బయటకు పోతాయట.

అలాగే ఎన్నో రోగాల ముప్పు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయట. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుందట. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు. చల్లని నీటిని తాగడం వల్ల శ్లేష్మం చిక్కగా మారుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే తలనొప్పి, జలుబు, దంతాల సున్నితత్వం, ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయట..ఇది అచలాసియాకు దారితీస్తుందని చెబుతున్నారు. ఇది అరుదైన వ్యాధి. ఇది అన్న వాహిక నుంచి కడుపునకు ఆహారాన్ని తీసుకెళ్లడం కష్టతరం చేస్తుందట.

అంతేకాదు చల్ల నీటిని తాగితే రక్తనాళాలు కుంచించుకుపోతాయని, అలాగే జీర్ణక్రియ నెమ్మదిస్తుందని, ఇది కడుపు ఉబ్బరం, తిమ్మిరి, మలబద్దకం వంటి సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందట. శరీర ఉష్ణోగ్రత క్రమంగా పెరిగినప్పుడు మన జీవక్రియ వ్యవస్థ కూడా మరింత చురుగ్గా మారుతుందట. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.