ముఖం ఎంత అందంగా ఉన్నా ఎర్రటి పెదాలు ముఖాన్ని మరింత అందంగా మార్చడంతో పాటు అలాంటి మనిషికి మరింత అందాన్ని చేకూరుస్తాయని చెప్పవచ్చు. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మొదటిగా కనిపించేవి మన ఎర్రటి పదాలు. ముఖం తెల్లగా ఉండి పెదవులు నల్లగా ఉంటే మీరు అందంగా ఉన్నప్పటికీ దానివల్ల నవ్వడానికి కానీ ఇతరులతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే కొంతమందికి ఎన్ని అప్లై చేసినా మాత్రం పెదవులు నల్లగానే ఉంటాయి. కానీ నల్లటి పెదాలను ఎర్రగా మార్చే కొన్ని చిట్కాలు ఉన్నాయట. వీటిని తప్పక పాటిస్తే అది సాధ్యం అవుతుందని చెబుతున్నారు. నాలుక తో పదేపదే తడపడం చేత కూడా పెదాలు నల్లగా మారుతాయి. లేదా శరీరం లో సరైన పోషక విలువలు లేకపోవడం మూలాన కూడా రావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఎక్కువగా నీళ్ళు, కాయగూరలు, పండ్లు వంటివి మీరు తీసుకుంటూ ఉండాలట. దానివల్ల విటమిన్లు శరీరానికి అందుతాయట.
తద్వారా పెదాలు సహజ రంగు లో ఉండడానికి దోహదపడతాయని చెబుతున్నారు.. కలబంద గుజ్జును పెదాల చుట్టు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందట. నిమ్మరసం, తేనె కలిపిన పదార్థాన్ని పెదాలు చుట్టూ నల్లగా ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. ఒక చెంచా శనగ పిండిలో, ఒక చెంచా బాదం నూనె కలిపి మర్దన చేయడం వల్ల పెదాలు తేమను పీల్చుకుని పొడిబారకుండా అవుతాయట. అలాగే కొబ్బరి నూనె, లిప్ బామ్,పాలమీగడ వెన్న లాంటి పదార్థాలను పెదవులకు అప్లై చేయడం వల్ల నెమ్మదిగా ఎర్రగా మారుతాయి అని చెబుతున్నారు. తరచుగా బీట్రూట్ ని అప్లై చేయడం వల్ల కూడా పెదాలు ఎరుపు రంగులోకి మారుతాయట.