Epilepsy Day : మూర్ఛ ఎందుకొస్తుంది ? వస్తే ఏం చేయాలి ?

Epilepsy Day : ఇవాళ (నవంబరు 17) జాతీయ మూర్ఛ దినం (National Epilepsy Day).

Published By: HashtagU Telugu Desk
Epilepsy Day

Epilepsy Day

Epilepsy Day : ఇవాళ (నవంబరు 17) జాతీయ మూర్ఛ దినం (National Epilepsy Day). మూర్ఛ వచ్చే చాలామందిని మనం చూస్తుంటాం.  దీనివల్ల బాధితులు అపస్మారక స్థితికి చేరుకుంటుంటారు. దీంతో బాధితుల సంబంధీకులు తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు. జాతీయ మూర్ఛ దినం సందర్భంగా మూర్ఛతో ముడిపడిన విషయాలను, అది రాగానే ఏం చేయాలనే వివరాలను తెలుసుకుందాం. మూర్ఛ రావడానికి ముందు.. రెడ్ సిగ్నల్స్‌లా బయటపడే లక్షణాల గురించి కూడా ఈ కథనంలో ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

లక్షణాలు.. ఉపశమన ఉపాయాలు  

  • బ్రెయిన్ స్ట్రోక్.. బ్రెయిన్ ఇన్ఫెక్షన్.. మెదడువాపు.. మెనింజైటిస్ వంటి వాటి వల్ల మూర్ఛ వస్తుందని కొందరు చెబుతుంటారు.
  • ఏదైనా ప్రమాదం సీన్ మెదడులో భయం గొలిపేలా  నాటుకుపోవడం వల్ల మూర్ఛ వస్తుందని ఇంకొందరు అంటారు.
  • మూర్ఛ అనేది పుట్టుకతో వచ్చే అసాధారణ సమస్య అని మరికొందరు పేర్కొంటారు.
  • ఏదిఏమైనప్పటికీ మూర్ఛ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. అకస్మాత్తుగా ఇబ్బందిపాలు చేస్తుంటుంది.
  • మూర్ఛ వల్ల హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతారు. శరీరం, చేతులు, కాళ్ళలో ఆకస్మిక వణుకు మొదలవుతుంది. శరీరంలో సూదులు గుచ్చుకున్న దారుణమైన ఫీలింగ్ కలుగుతుంది. చేతులు, కాళ్ళ కండరాలు అసాధారణంగా బిగుసుకుపోతాయి.
  • మూర్ఛ వ్యాధిని చికిత్స, మందుల ద్వారా మాత్రమే నయం చేయొచ్చు.
  • మీ చుట్టుపక్కల ఎవరైనా మూర్ఛతో బాధపడుతుంటే..  రోగి సరిగ్గా శ్వాస తీసుకునే ఏర్పాట్లు చేయండి.
  • మూర్ఛ రోగి తల కింద గుడ్డ లేదా మెత్తని దిండు పెట్టండి.
  • మూర్చ తగ్గే వరకు రోగి దగ్గరే ఉండండి. అతడి నోటిలో(Epilepsy Day) ఏమీ పెట్టవద్దు.

Also Read: ADAS : త్వరలో అన్ని కార్లలో ADAS.. ఏమిటిది ?

  Last Updated: 17 Nov 2023, 01:47 PM IST