Health: ఇలా రోగ నిరోధక శక్తి పెంచుకుందాం

  • Written By:
  • Updated On - December 5, 2023 / 06:00 PM IST

Health: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని సులువైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయడం శ్రేయస్కరం. శరీరం పునరుత్తేజానికి లోనవుతుంది. మనం తినే ఆహారంలో పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి.

చల్లని నీరు కాకుండా కాస్త గోరు వెచ్చని నీటిని తాగాలి. రోజులో కనీసం ఐదారు పర్యాయాలు వేడి నీటిని తాగడం వల్ల శరీరం ఉత్తేజితమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోగ నిరోధక శక్తి పెరగాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ, పప్పులు, క్యారెట్, బీట్ రూట్, అల్లం, వెల్లుల్లి, గుడ్లు, పాలు, నట్స్, పాలకూరపుదీనా, చికెన్, చేపలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. కేవలం తీసుకునే ఆహారం విషయంలోనే కాకుండా జీవనశైలి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.