Health: షుగర్ వ్యాధికి చెక్ పెడుదాం ఇలా

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 06:31 PM IST

Health: చక్కెరను నియంత్రించడంలో తులసి గింజలు ఎలా ప్రభావవంతంగా పనిచేస్తాయో తెలుసుకుందాం. తులసి గింజలు చక్కెరను ఎలా నియంత్రిస్తాయి.. ది సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకుల ప్రకారం, డయాబెటిక్ రోగులకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం చక్కెరను నియంత్రిస్తుంది. ఈ ఆహారాలు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే తులసి గింజలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. డయాబెటిక్ రోగులకు ఫైబర్ తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను చక్కగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

ఫైబర్ ఉన్న ఆహారాలు చక్కెరను నిర్వహించడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. టైప్-1 , టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు తులసి గింజలను తీసుకోవచ్చు. తులసి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తులసి గింజలను తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ విత్తనాలను తిన్న తర్వాత, మీకు ఎక్కువసేపు ఆకలి అనిపించదు. బరువు అదుపులో ఉంటుంది. తులసి గింజలు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్‌లు నయమవుతాయి.