Site icon HashtagU Telugu

Lemon Juice: నిమ్మరసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

Lemon Juice

Lemon Juice

సిట్రస్ ఫ్రూట్స్ లో ఒకటైన నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే. నిమ్మకాయను ఎన్నో రకాల వంటల తయారీలలో ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మకాయలలో సిట్రస్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ నిమ్మ రసాన్ని తరుచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. విటమిన్ సి మన శరీరానికి చాలా అవసరం. నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు తాగడం వల్ల నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి అంది హైడ్రేటెడ్ గా ఉంటారు.

గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తాగితే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. మధ్యాహ్నం పంచదార లేదా బెల్లం వేసి చల్లటి నిమ్మరసం తాగాలి. నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మైక్రోబియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అలెర్జీ ప్రతిచర్యలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇవే కాకుండా నిమ్మకాయ రసం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఆముదంలో కొద్దిగా నిమ్మరసం కలుపుతూ అవి రెండు పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఆమోదాన్ని తలకు మర్దన చేయడం వల్ల మంట తలనొప్పి, మూర్చలు అపస్మారం ఫిట్స్ తల తిరుగుడు వంటి సమస్యలు తగ్గుతాయట. అదేవిధంగా మార్కెట్లో దొరికే టూత్ పేస్టులు కొన్ని నాశరకం కూడా ఉన్నాయి. కొన్నింటిని ఉపయోగించడం వల్ల పళ్ళ మధ్య రక్తం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే నిమ్మరసం తాగడం వల్ల పల్లెలో నుంచి రక్తం కారడం చిగుళ్లలో నుంచి రక్తం కారడం చిగుళ్ళు మెత్తబడడం లాంటి సమస్యలు తగ్గుతాయట. ఎండాకాలం వచ్చిందంటే కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు చాలా మందికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చాక ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలుపుకొని అందులో ఉప్పు, తినే సోడా, పంచదార కలుపుకొని తాగితే వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ వడదెబ్బ తగిలినా కూడా ఈ ద్రావణాన్ని తాగితే వడదెబ్బ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.