మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున నిమ్మరసం నీళ్లు తాగడం అలవాటు. నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయని, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని చాలామంది ఉదయాన్నే ఈ నీటిని తాగుతూ ఉంటారు. మరి ఉదయాన్నే తాగితే ఏం జరుగుతుంది? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్స్ ను తొలగిస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
నిమ్మకాయలతో పాటు ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్ సి శరీరాన్ని రక్షిస్తుంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని, ఐరన్ శోషణ, కొల్లాజెన్ సంశ్లేషణ లో ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండటానికి రోజంతా హైడ్రేట్‌గా ఉండాలంటే ప్రతి రోజూ తగినంత నీరు తాగాలి. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ ఫైబర్ తినాలి అనే కోరికలను తగ్గిస్తుంది. దీనివల్ల సులువుగా బరువు తగ్గుతారు. నిమ్మరసం నీరు ఆకలిని అణచివేస్తుంది. డిటాక్స్ వాటర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
నిమ్మరసం నీళ్లు మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తాయి. కిడ్నీలో ఖనిజాలు చేరడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియం ఆక్సలేట్ తో ఏర్పడే వీటికి సిట్రేట్‌ను దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. శరీరం pH స్థాయిలను సమతుల్యం చేయడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. అలాగే నిమ్మరసంలో ఉండే సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శ్వాసను తాజాగా చేయడానికి, బ్యాక్టీరియా వల్ల వచ్చే నోటి దుర్వాసనను అరికడతాయి. నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ ఏర్పాటును అడ్డుకుంటాయి. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కాబట్టి ఉదయాన్నే పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిదే. ఇలా తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అలా అని ఎక్కువగా తాగితే మాత్రం పలు రకాల సమస్యలు తప్పవు.