Site icon HashtagU Telugu

Lemon Water : నిమ్మకాయ నీళ్లను ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?

Mixcollage 28 Jan 2024 04 46 Pm 5375

Mixcollage 28 Jan 2024 04 46 Pm 5375

నిమ్మకాయ నీరు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎండాకాలం వచ్చింది అంటే చాలు చాలామంది ఎక్కువగా ఈ నిమ్మకాయ నీటిని తాగుతూ ఉంటారు. నీరసంగా ఉన్నా ఒంట్లో శక్తి లేకపోయినా, వాంతులు అవుతున్నా ఇలా చాలా సందర్భాలలో ఈ లెమన్ వాటర్ ని తాగుతూ ఉంటారు. అలాగే బాడీ డిహైడ్రేషన్ గురైనప్పుడు కూడా ఈ లెమన్ వాటర్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. చాలామంది రోజూ ఉదయం పరగడుపున నిమ్మరసం నీళ్లు తాగుతుంటారు. కొందరు మాత్రం రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తాగుతుంటారు. ఎలా తాగినా ఎప్పుడు తాగినా నిమ్మకాయ నీళ్ల వల్ల చాలా లాభాలు ఉంటాయని అనుకుంటూ ఉంటారు.

కానీ అలా అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. కొన్ని కొన్ని సందర్భాలలో తాగడం వల్ల మాత్రమే నిమ్మకాయ నీళ్ళ వల్ల లాభాలు కలుగుతాయట. మరి ఎలాంటి సందర్భాలలో నిమ్మకాయ నీరు తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిమ్మకాయ నీళ్లను ఉదయం తాగితే డీహైడ్రేషన్ కు గురి కారు. అలాగే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా కూడా ఉంటారు. అలసట కూడా రాదు. నీరసం ఉండదు. శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఉన్న అనవసర కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీకు జీర్ణ సమస్యలు ఉన్నా లేదా గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు ఉన్నా ఉదయం పూట నిమ్మరసం నీళ్లను తాగడం మంచిది.

రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తాగితే… మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తాగి పడుకుంటారు. తెల్లారే సరికి మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే పెద్ద పేగు కూడా శుభ్రం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కడుపులో మంట రాదు. ఎక్కడైనా శరీరం మీద వాపులు వస్తే అవి కూడా తగ్గిపోతాయి.