Site icon HashtagU Telugu

Dark Elbows: మోచేతులు నల్లగా ఉన్నాయా.. వెంటనే ఇలా చేయండి!

Dark Elbows

Dark Elbows

మామూలుగా చాలామందికి మోచేతులపై అలాగే మోకాళ్ళపై నలుపు అలాగే ఉంటుంది. కాళ్లు చేతులు అన్ని ఒక రంగులో ఉన్న మోకాలు,మోచేతులు మాత్రం ఒక రంగులో ఉంటాయి. కొందరికి మాత్రం మోచేతులపై భాగం తెల్లగానే ఉంటుంది. అయితే మోచేతిపై ఉండే నలుపును పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్లను ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో పాటు కొన్ని నేచురల్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మోచేతులపై ఉన్న నలుపుదనం తొలగిపోతుందని చెబుతున్నారు..

శెనగ పిండి, నిమ్మకాయతో మోచేతుల నలుపును పోగొట్టవచ్చట. శనగపిండిలోని ఉండే ఔషద గుణాలు చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను తొలగించడానికి సహాయపడతాయట. శనగపిండి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుందట. అలాగే శనగపిండి ముఖంలోని రంధ్రాలను లోతుగా శుభ్రపరచడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే నిమ్మకాయలో కూడా బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మం నలుపును తొలగించడానికి ఎంతో బాగా సహాయపడుతుందట. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంలోని టానింగ్ ను తొలగించి స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుందట.

అయితే ఇందుకోసం ముందుగా శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత సగం నిమ్మకాయను తీసుకుని రసాన్ని శనగపిండిలో కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపిన తర్వాత తరిగిన నిమ్మకాయ సహాయంతో ఈ పేస్ట్ ను మోచేతులకు అప్లై చేయాలి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత దూది, వాటర్ తో మోచేతులను శుభ్రం చేయాలి. మొదటి సారే మీరు మోచేతుల్లో తేడాను గమనిస్తారని చెబుతున్నారు.