Site icon HashtagU Telugu

Eye Sight: ఓక్రా వాటర్ తో కంటి చూపు సమస్యలకు చెక్?

Eye Sight

Eye Sight

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, లాప్టాప్, కంప్యూటర్, ట్యాబ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాడి వరకు చాలామంది కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నపిల్లలకి కళ్ళజోడు వస్తున్నాయి. దానికి తోడు సరైన నిద్ర లేకపోవడం వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కంటి చూపును మెరుగుపరచుకోవడం కోసం అనేక రకాల చిట్కాలను పాటిస్తూ ఉన్నారు.

అయితే కంటిచూపును పెంచే వాటిలో బెండకాయ కూడా ఒకటి. ప్రతి కూరగాయలో ఏదో ఒక విటమిన్‌ ఉంటుంది. కాబట్టి ప్రతి వారంలో 5 రోజుల పాటు కూరగాయలను తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. అయితే కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ బెండకాయలను తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో బీటా కెరోటిన్, జియాక్సంతిన్, లుటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల కంటిలో శుక్లం రాకుండా సహాయపడుతుంది. అలాగే కంటిచూపు సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే నిద్రలేచి తర్వాత ఖాళీకడుపుతో ఓక్రా వాటర్‌(బెండకాయ నీరు) తాగడం వల్ల కంటి చూపు సమస్యల నుంచి బయటపడవచ్చు.

ప్రతిరోజూ ఈ వాటర్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ ఓక్రా వాటర్‌ను తాగడం వల్ల పొట్టలో సమస్యలు కూడా దూరమవుతాయి. కంటి చూపును పెంచుకోవాలనుకునేవారు ప్రతి రోజూ 2 నుంచి 3 చిన్న సైజు బెండకాయలను తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూగా తగ్గిస్తుంది. బెండకాయను ఎండలో ఎండబెట్టి పొడిలా తయారు చేసి దానిని ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగితే, మంచి ఫలితాలు కనిపిస్తాయి.
రెట్టింపు ప్రయోజనాలు పొందడానికి బెండకాయలను ముక్కలుగా చేసి రాత్రిపూట నీటిలో నానబెట్టి అల్పాహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.