Lady Finger: బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?

మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొం

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 09:14 PM IST

మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు బెండకాయ నువ్వు ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి కూడా ఇష్టపడరు. ఇక బెండకాయతో మనం ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూనే ఉంటాం. ఈ బెండకాయలు మనకు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో విరివిగా లభిస్తూ ఉంటాయి. బెండకాయ‌ తింటే మ‌ధుమేహం అదుపులో ఉండ‌టంతో పాటు ప‌లు ఆరోగ్య ప్రయోజ‌నాలు ఉన్నాయి. పోష‌కాల‌తో నిండిఉండే బెండ కాయ‌లో ఫైబ‌ర్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి.

అంతేకాకుండా ఈ బెండకాయ వల్ల ఇంకా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు. బెండకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. బెండకాయలో ఉండే గ్లైసెమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయలో ఉండే ప్రొటీన్ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొటీన్లు శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి. త‌గినంత ప్రొటీన్ తీసుకుంటే అది దీర్ఘ‌కాలం మ‌ధుమేహ నియంత్ర‌ణ‌కు ఉప‌క‌రిస్తుంద‌ని పలు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. బెండకాయ తినడం ద్వారా శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గుతుందట.

బెండకాయలోని ఫైబర్, పెక్టిన్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఊబకాయంతో బాధపడే వారు తరుచుగా బెండకాయ తింటే మంచిదట. బెండకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. బెండకాయలో క్యాన్సర్ తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయట. బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గర్భంతో ఉన్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైన అంశం, బెండకాయలలో ఉండే ఫోలేట్ తల్లి, బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పలు అధ్యయనాలు వెల్లడయింది. బెండకాయ తింటే జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. బెండకాయ లోని తేమజిగురు వల్ల కొంచం తిన్న వెంటనే కడుపు నిండుతుందట. బెండకయ మూత్రవిసర్జనకారిగా పనిచేస్తుందట.బెండకాయ ఎక్కువగా తినే వ్యక్తులు హైడ్రేటెడ్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది.