Espresso Coffee Vs Alzheimers : ఈ కాఫీ తాగితే అల్జీమర్స్ కు ఆదిలోనే అడ్డుకట్ట!

Espresso Coffee Vs Alzheimers :  మతిమరుపు వ్యాధి "అల్జీమర్స్" కు కాఫీ అడ్డుకట్ట వేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటలీలోని వెరోనా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

  • Written By:
  • Updated On - July 21, 2023 / 10:36 AM IST

Espresso Coffee Vs Alzheimers :  మతిమరుపు వ్యాధి “అల్జీమర్స్” కు కాఫీ అడ్డుకట్ట వేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటలీలోని వెరోనా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.  ప్రత్యేకించి ఎస్ప్రెస్సో రకం  కాఫీ అల్జీమర్స్ లక్షణాలను, కొన్ని న్యూరో డీజనరేటివ్ వ్యాధులను నివారిస్తుందని ల్యాబ్ స్టడీలో గుర్తించారు. ఎస్ప్రెస్సో రకం  కాఫీలోని సమ్మేళనాలు అల్జీమర్స్ వ్యాధి ఆవిర్భావానికి కారణమయ్యే ప్రక్రియను ఆదిలోనే అంతం చేస్తాయి. ఈమేరకు వివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్ “జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ”లో పబ్లిష్ అయింది. టౌ ప్రోటీన్లు (tau protein)  మెదడులోని న్యూరాన్లలో ఉంటాయి. న్యూరాన్లు అంటే నాడీకణాలు. నాడీకణాల లోపల సమాచారం బదిలీలో, నాడీకణాల ఆకారం  ఏర్పడటంలో ముఖ్య పాత్ర పోషించే మైక్రో ట్యూబ్యూల్స్ (microtubules) పనితీరును నిలకడగా, కంట్రోల్ లో ఉంచడంలో  టౌ ప్రోటీన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే “అల్జీమర్స్” తరహా వ్యాధులు వచ్చిన వారిలో టౌ ప్రోటీన్లు ఒకదాంతో ఒకటి  కలిసిపోయి ఫైబ్రిల్స్‌గా ఏర్పడుతాయి. ఈ ప్రక్రియ వల్లే  అల్జీమర్స్ మొదలవుతుందని నమ్ముతారు.  ఎస్ప్రెస్సో కాఫీలో ఉన్న సమ్మేళనాలు.. మెదడులోని టౌ ప్రోటీన్లు ఒకదాంతో ఒకటి  కలిసిపోకుండా అడ్డుకున్నాయని ల్యాబ్ స్టడీలో తేలింది. ఫలితంగా అల్జీమర్స్ కు ఆదిలోనే అడ్డుకట్ట పడుతుందని(Espresso Coffee Vs Alzheimers) శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read : King Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ..!

ఎస్ప్రెస్సో కాఫీ తయారీ.. 

ఎస్ప్రెస్సో కాఫీ తయారీ కోసం కెఫియా అరబికా, కాఫీ కోనెఫోరా (రోబస్టా) రకం కాఫీ గింజలను వాడుతుంటారు.  ఈ రెండింటిలోనూ కెఫియా అరబికా గింజలతో అత్యుత్తమ ఎస్ప్రెస్సో కాఫీ తయారవుతుంది. కెఫియా అరబికా గింజలతో తయారు చేసే ఎస్ప్రెస్సో కాఫీలో 52 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. కాఫీ తయారీ మెషీన్‌ని ఉపయోగించి కెఫియా అరబికా గింజలను దాదాపు 30 సెకన్ల పాటు 9 బార్‌ల అధిక పీడన వేడి నీటితో బ్రూ చేస్తారు. మీ కారు లేదా సైకిల్ టైర్‌ లోకి గాలిని పంపింగ్ చేసేందుకు కనీసం  32 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ల (PSI) ఒత్తిడి (పీడన శక్తి)  అవసరం. కాఫీ మెషీన్ లోని 9 బార్‌ల పీడన శక్తి అనేది 130 PSI లకు సమానం. అంటే కారు టైర్ లోకి గాలి కొట్టేందుకు వినియోగించే పీడన శక్తి కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

Also read : Project K Story: ప్రభాస్ “కల్కి 2898 ఏడీ” మూవీ స్టోరీ ఇదేనా..?

రోబస్టా రకం కాఫీ గింజలతో..  

ఇక రోబస్టా రకం కాఫీ గింజలతో తయారుచేసే ఎస్ప్రెస్సో కాఫీలో 90 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. మనం సరదాగా తినే 100 మిల్లీగ్రాముల డార్క్ చాక్లెట్‌లో 80 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. మనం ఒక రోజులో ఎంత కెఫిన్ మోతాదును  తీసుకోవచ్చు ? అంటే.. రోజుకు  300 మిల్లీగ్రాముల నుంచి 400 మిల్లీగ్రాముల కెఫిన్ మాత్రమే తీసుకోవాలని అంటారు. కెఫీన్ కాఫీలో మాత్రమే కాకుండా ఇతర ఆహార వనరులలో కూడా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి.